ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. కానీ సుకుమార్ మాత్రం నిదానమే ప్రధానం అంటున్నాడు. బన్నీ కూడా తొందరేం లేదు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పట్లో పుష్ప2 కష్టమేనని అంటున్నారు. పుష్ప సినిమాతో పెరిగిన అంచనాలకు తగ్గట్టుగా స్క్రిప్టు మార్చడానికే సంవత్సరం సమయం తీసుకున్నాడు సుకుమార్. ఇటీవలె ఓ ఐదు రోజులు షూటింగ్ చేశామని చెప్పుకొచ్చాడు సుక్కు. అలాగే ఈ సారి పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నామని.. అస్సలు తగ్గేదేలే అంటున్నాడు బన్నీ. దాంతో నెక్స్ట్ ఇయర్ కూడా పుష్ప2 రిలీజ్ అయ్యే ఛాన్స్ తక్కువ అంటున్నారు. ప్రస్తుతం బన్నీ, సుక్కు తీరు చూసి.. 2023లో ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అవదనే అంచనాకు వచ్చేస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను.. హడావుడిగా తీయాల్సిన అవసరం లేదని భావిస్తున్నాడట అల్లు అర్జున్. అందుకే లేట్ అయినా కూడా అవుట్ పుట్ అదిరిపోవాలని సుకుమార్‌తో అంటున్నాడట బన్నీ. దాంతో 2024వ ఆరంభంలో.. అంటే సంక్రాంతికి లేదా సమ్మర్‌కి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. పుష్ప2 కోసం మరో సవంత్సరానికి పైగా వెయిట్ చేయాల్సిందేనని చెప్పొచ్చు. ఇకపోతే రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.