TG: భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సీతారామచంద్రస్వామి వారి పెళ్లి వేడుకలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ ఏర్పాట్లతో భద్రగిరి ప్రత్యేక శోభను సంతరించుకుంది. పెళ్లి వేడుక ఏర్పాట్లతో పురవీధులు కాంతులీనుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలైన సీతారాముల కల్యాణం, మహాపట్టాభిషేకం ఈనెల 27, 28వ తేదీల్లో జరగనున్నట్లు ఆలయ పండితులు వెల్లడించారు.