తిరుమలలో ఈ నెల 30 నుంచి 3 రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. దీంతో ఈ రోజుల్లో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం తదితర సేవలను TTD రద్దు చేసింది. 30న స్వామి తన దేవేరులతో మాడవీధుల్లో విహరించి, వసంత మండపానికి చేరుకుంటారు. 31న బంగారు రథంపై ఊరేగింపు, వసంతోత్సవం.. చివరిరోజున స్వామి, సీతారామలక్ష్మణాంజేయులతో పాటు రుక్మిణీ సమేత కృష్ణుడితో ఉత్సవంలో పాల్గొంటారు.