తిరుమల కొండపై పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. నారాయణగిరి ఉద్యాన వనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 25న మలయప్ప స్వామివారి గజవాహన సేవ, 26న అశ్వవాహన సేవ, 27న గరుడ వాహనంపై పద్మావతి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ఈ మూడు రోజులపాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు.