• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మాదాపూర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

RR: మాదాపూర్ గోకుల్ ప్లాట్స్ కాలనీలో హనీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేర్, ఆక్సీ డెంటల్, పిక్సెల్ ఐ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గాంధీ, మాజీ కార్పొరేటర్ శ్రీకాంత్‌తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పేద ప్రజల కోసం జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థో, డెంటల్ వంటి పలు విభాగాల్లో నిపుణులతో ఉచిత పరీక్షలు చేశారు.

April 5, 2026 / 05:45 PM IST

ఎస్పీ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

NRML: భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ జానకి షర్మిల ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్మరించారు. సామాజిక న్యాయ సాధనలో ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.

April 5, 2026 / 05:37 PM IST

‘సమగ్రాభివృద్ధికి అంబేద్కర్, జగ్జీవన్ రామ్ రెండు కళ్లు’

JN: దళితుల సమగ్రాభివృద్ధికి డా. బి.ఆర్. అంబేద్కర్, డా. బాబు జగ్జీవన్ రామ్ రెండు కళ్ల వంటి మహనీయులని MLA శ్రీహరి పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ఇవాళ డా. బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దళితులు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన జగ్జీవన్ రామ్ ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.

April 5, 2026 / 05:37 PM IST

మేయర్ క్యాంప్ కార్యాలయం ప్రారంభించిన కేంద్ర మంత్రి

KNR: కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మేయర్ క్యాంప్ కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆయనకు గజమాలతో ఘన స్వాగతం పలికారు. సంజయ్ మాట్లాడుతూ.. ఈ కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలవాలన్నారు. విలీన గ్రామాల అభివృద్ధియే లక్ష్యంగా ముందుకెళ్తానన్నారు.

April 5, 2026 / 05:36 PM IST

మండలాల ఇన్‌ఛార్జ్‌లుగా డీసీసీ సభ్యులు

MNCL: లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని మండలాలకు డీసీసీ సభ్యులను ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ లక్షెట్టిపేట మున్సిపాలిటీ, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు ఇన్చార్జిలను నియమించారు. లక్షెట్టిపేట మున్సిపాలిటీకి అక్కల శకుంతల, దండేపల్లికి ముఖరాంజా, లక్షెట్టిపేట మండలానికి ముజఫర్ అహ్మద్ నియమితులయ్యారు.

April 5, 2026 / 05:36 PM IST

‘బాబు జగ్జీవన్ రావుకు భారతరత్న ఇవ్వాలి’

HNK: కాకతీయ యూనివర్సిటీ MSF ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ మాట్లాడుతూ.. దేశ తొలి ఉప ప్రధానిగా సేవలందించిన బాబు జగ్జీవన్ రావు కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రధానం చేయాలని కోరారు.

April 5, 2026 / 05:32 PM IST

పార్క్‌ను సందర్శించిన ఉన్నతాధికారులు

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట శివారులోని నగర యోజన పార్క్‌ను ఆదివారం PCCF రత్నాకర్, CF అపర్ణ, DFO జోజి సందర్శించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్న అభివృద్ధి పనులను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

April 5, 2026 / 05:30 PM IST

చేనేత రంగానికి చేయూతనివ్వండి: మేడం రామకృష్ణ

GDWL: నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరింత చేయూతనివ్వాలని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ కోరారు. ఆదివారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని 9వ వార్డు కౌన్సిలర్ రామలింగేశ్వర కాంబ్లే మరియు నేత కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత భరోసా పథకం, హ్యాండ్లూమ్ పార్కు అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు. 

April 5, 2026 / 05:30 PM IST

భూ కుంభకోణంపై హరీశ్ రావు సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని నాదరుల్లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 374 ఎకరాల దళిత రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు కాపాడిన భూములను ఇప్పుడు దోచుకుంటున్నారని, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల భూములకు రక్షణ లేదని ఆయన మండిపడ్డారు.

April 5, 2026 / 05:27 PM IST

‘ఎమ్మెల్యే పసుపు రైతులకు క్షమాపణ చెప్పాలి’

JGL: పసుపు ధరలు పెరిగి రైతులు సంతోషంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అనుచితమని బీజేపీ కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి అన్నారు. క్వింటాల్‌కు రూ.12,000 ధర రావడం రైతులకు లాభదాయకమని, ధరలు పడిపోతాయని చెప్పడం సరైంది కాదన్నారు. రైతులకు మార్గదర్శకత్వం ఇవ్వాల్సింది ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

April 5, 2026 / 05:27 PM IST

నాగారం-వికారాబాద్‌కు బస్సు ప్రారంభం

VKB: నాగారం గ్రామం నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రానికి నూతన బస్సును ఏర్పాటు చేశారు. గతంలో నాగారం నుంచి వికారాబాద్‌కు బస్సు రాకపోకలు ఉండేవి మధ్యలో ఆగిపోవడంతో దీనిని తిరిగి పునరుద్దించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వికారాబాద్ MLA గడ్డం ప్రసాద్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, సీనియర్ నాయకులు ఉన్నారు.

April 5, 2026 / 05:26 PM IST

నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

BHPL: రేగొండ మండలం రేపాక గ్రామంలో అక్రమ సంబంధం కారణంగా జరిగిన హత్య కేసులో రేగొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన కుర్రే చేరలు (55) అనే వ్యక్తి తన అన్న కుమారులైన రామ్, లక్ష్మణ్‌ల దాడికి గురై మృతి చెందాడు. CH కరుణాకర్ రావు మాట్లాడుతూ, కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని తెలిపారు.

April 5, 2026 / 05:25 PM IST

‘రేషన్ అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు’

KMM: పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ హెచ్చరించారు. చెన్నూరు గ్రామంలో రాత్రి వేళల్లో బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న ఫిర్యాదుతో ఆదివారం ఆయన రేషన్ దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, నిల్వలపై ఆరా తీశారు. లబ్ధిదారులకు బియ్యం సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు.

April 5, 2026 / 05:17 PM IST

AITUCలో భారీ చేరికలు

MHBD: జిల్లా కేంద్రానికి చెందిన చెరుకు మిషన్ వీధి వ్యాపార కార్మికులు 20 మంది ఆదివారం AITUCలో చేరారు. AITUC జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధిరెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై అనేకమంది కార్మికులు AITUCలో చేరుతున్నారన్నారు.

April 5, 2026 / 05:16 PM IST

కొమురవెల్లిలో పోటెత్తిన భక్తులు!

SDPT: కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం కావడంతో భక్తులతో పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. భక్తులు పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి, స్వామివారికి పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

April 5, 2026 / 05:16 PM IST