• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం ఎమ్మెల్యేకు వినతి

JGL: రాయికల్ మండలం వడ్డె లింగాపూర్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ మండల సర్పంచులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ఆదివారం వినతిపత్రం అందజేశారు. రైతులు పండించిన మొక్కజొన్న విక్రయానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించాలన్నారు . స్పందించిన ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 08:32 AM IST

15 గ్రామాల్లో ఐస్ క్రీమ్ వాహనాలకు నో ఎంట్రీ

నిర్మల్ జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు ఐస్ క్రీమ్ నిషేధంపై ఏకమవుతున్నాయి. హానికర రంగులు, రసాయనాలతో తయారుచేసే లోకల్ ఐస్ క్రీమ్‌లతో చిన్న పిల్లల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని, అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. దీంతో ఏకంగా ఇప్పటి వరకు 15 గ్రామాల్లో ఐస్ క్రీమ్ వాహనాలకు నో ఎంట్రీ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

April 6, 2026 / 08:31 AM IST

పలు ప్రాంతాల్లో పవర్ కట్

KNR: పట్టణంలో 11 కేవీ శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలో సోమవారం విద్యుత్ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్-2 ఈడీఏ ఎం. లావణ్య తెలిపారు. విద్యానగర్, కొత్తయస్వాడ ప్రాంతాల్లో ఉదయం 9:30 నుంచి 11:30 వరకు విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

April 6, 2026 / 08:31 AM IST

నేటి నుంచి వీరభద్రస్వామి జాతర ఉత్సవాలు

SRD: రాయికోడ్‌లోని వీరభద్రస్వామి దేవాలయ జాతర ఉత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు వైభవంగా కొనసాగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ కులకర్ణి సతీశ్, ఈవో శివ రుద్రప్ప తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, మహిళలతో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

April 6, 2026 / 08:28 AM IST

గజ్వేల్ బంద్.. బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ బైఠాయింపు

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడికి నిరసనగా సోమవారం బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ బంద్ చేపట్టారు. బంద్‌లో భాగంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛర్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి బైఠాయించారు. బస్ డిపో నుంచి బస్సులను బయటకు వెళ్లకుండా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.

April 6, 2026 / 08:26 AM IST

‘రైతులు అప్రమత్తంగా ఉండి సమస్యలను తెలియజేయాలి’

MBNR: వేసవిలో రైతులకు సాగునీటి కోసం విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని ఏఈ దేవేందర్ నాయుడు తెలిపారు. ఆదివారం హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను పరిశీలించారు. సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని లైన్మెన్లను ఆదేశించారు. రైతులు అప్రమత్తంగా ఉండి సమస్యలను తెలియజేయాలని సూచించారు.

April 6, 2026 / 08:24 AM IST

జిల్లా యూత్ అధ్యక్షునిగా సతీష్

BHPL: పెరిక సంఘం జిల్లా యూత్ అధ్యక్షునిగా కారుకూరి సతీష్‌ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సతీష్ మాట్లాడుతూ.. పెరిక సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన నియమకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

April 6, 2026 / 08:22 AM IST

మాచర్లలో ఉత్సాహంగా సంధ్యారాళ్ల పోటీలు

GDWL: గట్టు మండలం మాచర్లలో ఈస్టర్ పండుగ సందర్భంగా సర్పంచ్ వజ్రమ్మ తిమ్మప్ప ఆధ్వర్యంలో సంధ్యా రాళ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గ్రామ యువకులు పోటీపడి తమ బలాన్ని ప్రదర్శించారు. విజేతలకు సర్పంచ్, ఉప సర్పంచ్ సుదర్శన్ కలిసి నగదు బహుమతులు అందజేశారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమని నిర్వాహకులు తెలిపారు. అనంతరం గ్రామ నాయకులను సన్మానించారు. 

April 6, 2026 / 08:20 AM IST

నేడు ఎమ్మెల్యే జారే పర్యటన

BDK: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సోమవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తహసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం మర్రిగూడెం, అబ్బుగూడెం ప్రాథమిక పాఠశాలల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.

April 6, 2026 / 08:15 AM IST

గంజాయి సాగు చేస్తే ప్రభుత్వ పథకాల కోత

PDPL: గంజాయి సాగు చేసే వారికి ప్రభుత్వ పథకాలు కోత విధిస్తూ డ్రగ్స్ రహిత జిల్లాగా చేస్తున్నారు. ముత్తారం మండలంలో ఓ రైతు పొలాల్లో గంజాయి సాగు చేస్తూ పట్టుబడ్డాడు. తాజాగా సుల్తానాబాద్ మండలంలో గంజాయి సాగు చేస్తూ ఒడిశాకు చెందిన వ్యక్తిని పట్టుకున్నారు. ఇలాంటి వారికి రైతు భరోసా, రైతు బీమా, పంటకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు రాకుండా నివేదించారు.

April 6, 2026 / 08:14 AM IST

ఏటూరునాగారంలో నేడు ప్రజావాణి–గిరివాణి

MLG: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి, గిరివాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ టీఎస్ దివాకర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమానికి సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.

April 6, 2026 / 08:12 AM IST

నేడు MLA పర్యటన వివరాలు

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలో పలు గ్రామాల్లో సోమవారం MLA KR నాగరాజు విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా MLA మొదట పర్వతగిరిలో మొక్కజొన్న కొనుగోళు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు నాగారంలో మొక్కజొన్న కొనుగోళు కేంద్రాన్ని మొదలుపెట్టన్నునట్లు అధికారులు తెలిపారు. అనంతరం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ జిల్లా నాయకులు తెలిపారు.

April 6, 2026 / 08:12 AM IST

‘ఇంటి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిబేట్’

MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని ఇంటి యజమానులకు మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ పలు సూచనలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ఇంటి యజమానులు 2026-27 సంవత్సరానికి ఇంటి పన్నును పూర్తిగా చెల్లిస్తే ఐదు శాతం రిబేట్ లభిస్తుందన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి 30వ తేదీ వరకు ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రిపీట్ లభిస్తుందని ఆయన వివరించారు.

April 6, 2026 / 08:10 AM IST

నేరడిగొండలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ADB: నేరడిగొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోథ్ మండలం నక్కలవాడ గ్రామానికి చెందిన మోహన్ పెళ్లి పత్రికలను పంచడానికి ఆరేపల్లి గ్రామానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆరేపల్లి సమీపంలో డివైడర్‌ను తన బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

April 6, 2026 / 08:08 AM IST

నగదు, బంగారంతో ఉన్న బ్యాగ్ అప్పగింత

KNR: ఆటో డ్రైవర్ నిజాయితీని చాటుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. గన్నేరువరం మండలంలోని మానసా దేవి ఆలయానికి వచ్చిన కొందరు భక్తులు.. దర్శనం అనంతరం ఆటోలో గుండ్లపల్లికి వెళ్లారు. హడావుడిలో తమ బ్యాగును ఆటోలోనే మరిచిపోయారు. ఆ బ్యాగులో 4 తులాల బంగారు గొలుసులు, రూ, 20,000 నగదు ఉన్నాయి.

April 6, 2026 / 08:07 AM IST