ADB: నేరడిగొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోథ్ మండలం నక్కలవాడ గ్రామానికి చెందిన మోహన్ పెళ్లి పత్రికలను పంచడానికి ఆరేపల్లి గ్రామానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆరేపల్లి సమీపంలో డివైడర్ను తన బైక్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.