SRCL: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వద్ద మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు రూ. 10 వేల కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసిన సందర్భంగా మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు ముఖ్య అతిథిగా హాజరై మహిళా ప్రయాణికులకు ఉచిత టికెట్లు అందజేసి వారిని సత్కరించారు.
NRML: పురపాలక సంఘం సమావేశ మందిరంలో వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అధ్యక్షతన మంగళవారం బడ్జెట్ సమావేశం నిర్వహించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌పై చర్చిస్తూ ఆదాయం, ఖర్చులు సమీక్షించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్యం, డ్రైనేజీ, రహదారులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించారు.
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వరుసగా క్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహిస్తూ పేదలకు ఆసరాగా నిలుస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం ఇద్దరు మహిళలకు గర్భసంచిలోని గడ్డలను విజయవంతంగా తొలగించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మరో ఇద్దరు మహిళలకు గాల్ బ్లాడర్ నెక్‌లోని స్టోన్స్‌ను లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా తొలగించామన్నారు.
SRPT: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏప్రిల్ 2 నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలపై ప్రత్యేక కార్యాచరణతో అవగాహన కల్పిస్తామని వివరించారు.
BHNG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. చిన్నకొండూర్‌కు చెందిన బొంగు నర్సింహకు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూశారు. సుమారు రూ. 2.50 లక్షల ఖర్చుతో ఆపరేషన్ చేయించి ప్రాణాలు కాపాడారు. ఈ సాయానికి నర్సింహ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.
KMR: కులం పేరుతో దూషించడంతో పాటు దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ ఎస్సీ/ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది. 2022లో కామారెడ్డికి చెందిన నర్సింలు, శ్యామ్, రాజు అనే వ్యక్తులు వ్యాపార గొడవలతో బాలు నాయక్ అనే వ్యక్తిని కులం పేరుతో దూషించి, భౌతిక దాడికి పాల్పడ్డారని బాలు ఫిర్యాదు చేశారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన డాక్టర్ అనుప్ రావు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులయ్యారు. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ఆయన పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. ఆయనను పలువురు అభినందించారు.
BHPL: గణపురం మండలం గన్పూర్ రిజర్వాయర్‌లో మంగళవారం NDRF ఆధ్వర్యంలో వరదలు, నీటిలో మునిగితే ఎలా రక్షించుకోవాలో అన్న అంశంపై డెమో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా MLA గండ్ర, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై, మాట్లాడారు. సమగ్ర అవగాహన ద్వారా మాత్రమే విపత్తుల సమయంలో తమను తాము, ఇతరులను కాపాడుకోవచ్చని తెలిపారు.
NLG: దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రిసెప్షన్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్ విభాగం, లాక్ అప్, ఎస్ఏహెచ్ గదిని పరిశీలించారు. సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
WNP: హైదరాబాద్ నగరంలోని యూసుఫ్ గూడ చెందిన మెహరున్నిసా బేగం ఆరోగ్య ఆర్థిక సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.32,000 రూపాయలు మంజూరు చేశారు. ఆ చెక్కును రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి లబ్దిదారు కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చిన్నారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
JN: జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఉదయం అకాల వర్షం పడింది. ఉరుములతో కూడిన వాన పడడంతో వాతావరణంలో మార్పు వచ్చింది. రెండు రోజుల నుండి వేసవి మందు ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలకు కొద్దిపాటి వర్షం వల్ల ఉపశమనo ఏర్పడింది. ఈ అకాల వర్షంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారు.
MHBD: రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (REWA) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. MHBDలో జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పోకు మెమోరాండం సమర్పించారు. సమస్యల పరిష్కానికి కృషి చేయాలని కోరారు.
జగిత్యాల నియోజకవర్గంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలో దెబ్బతిన్న వంతెనలు, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్లు, పునరుద్ధరించాల్సిన రోడ్ల సమస్యలను ఆయన మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
SDP: గజ్వేల్ మండలం కొడకండ్ల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మల్లన్న సాగర్ కాలువలో పడి మరణించిన 8వ తరగతి విద్యార్థిని రిషిక కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా HM శ్రీశైలంతో పాటు తోటి ఉపాధ్యాయులు కలిసి రూ.18 వేలు, 50 కిలోల బియ్యం బాధిత కుటుంబానికి అందజేసారు. ఆ కుటుంబానికి ఉపాధ్యాయులు అండగా నిలవడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు.
SRCL: బ్యూటిషియన్ కోర్సులో నైపుణ్యత పెంపొందించుకుని స్వయం ఉపాధికి బాటలు వేసుకోవాలని బ్యాంకర్ బాలమురళి పిలుపునిచ్చారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని గిరిజన మహిళ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ గూర్చి వివరించారు.