• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహిళ శక్తి పథకం మహిళల సాధికారితకు నిదర్శనం

MDCL: మహిళ శక్తి పథకం మహిళల సాధికారితకు నిదర్శనమని జిల్లా సంక్షేమ అధికారి డా. శారద తెలిపారు. మంగళవారం అల్వాల్ సఖి కేంద్రంలో నిర్వహించిన మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించడం, సామాజిక, ఆర్థిక స్వావలంబన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీడీపీవోలు తిరుమలదేవి, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

April 1, 2026 / 06:13 AM IST

గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అమరేందర్ రావు

PDPL: గోదావరిఖని బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బల్మూరి అమరేందర్ రావు, గుజ్జెటి సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా కుడిది వెంకటేశ్ ఎన్నికయ్యారు. 254 ఓట్లలో 220 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అమరేందర్ రావును పలువురు లాయర్లు అభినందించారు.

April 1, 2026 / 06:13 AM IST

జూబ్లీహిల్స్‌లో 300 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా

HYD: జూబ్లీహిల్స్ సొసైటీలో వరద కాలువలను పూడ్చి, ప్లాట్లుగా చేసి విక్రయించారు. అక్కడ గదులు నిర్మాణం చేయడంతో పలువురు హైడ్రా దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన హైడ్రా.. క్షేత్రస్థాయిలో పరిశీలించి గదులను క్లియర్ చేసింది. దీంతో 300 గజాల స్థలాన్ని కాపాడినట్లు చెప్పారు. అలాగే వరద కాలువను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.

April 1, 2026 / 06:10 AM IST

రూరల్ PSలో డీసీపీ ఆకస్మిక తనిఖీ

KNR: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట రూరల్ పోలీస్ కార్యాలయాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) పి. వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి సీఐ కె.లక్ష్మీనారాయణను ప్రశంసించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

April 1, 2026 / 06:10 AM IST

లారీని ఢీ కొట్టిన ఆటో

WGL: సంగేం (M) తీగరాజుపల్లె ఫోటో తండాకు చెందిన హనుమ కృష్ణ రవి వరంగల్ కూరగాయల మార్కెట్ నుంచి ఆటోలో తిరిగి వస్తుండగా ఓంకార్ ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై ఉన్న లారీని ఢీ కొట్టారని స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్ రోడ్డుపై వాహనం నిలపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. సంఘటనలో ముగ్గురికి గాయాలు కాగా వైద్యం నిమిత్తం MGM తరలించినట్లు తెలిపారు.

April 1, 2026 / 06:08 AM IST

నేడు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్న MLA

NRML: ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ బుధవారం జన్నారం మండలంలో పర్యటించనున్నారు. మ. 12:30 నిమిషాలకు జన్నారం మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు CMRF చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం మ. 1:30 నిమిషాలకు జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీనివాస్‌ను పరామర్శిస్తారు.

April 1, 2026 / 06:08 AM IST

నేడు మెగా వైద్య శిబిరం

KMM: చింతకాని పీహెచ్‌సీలో ఇవాళ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారి అల్తాఫ్ తెలిపారు. స్త్రీల వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్యులు, జనరల్ మెడిసిన్‌కు చెందిన వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 1, 2026 / 06:07 AM IST

‘సమిష్టి నిర్ణయంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యం’

ADB: జిల్లా అధికారులు, వార్డ్ కౌన్సిలర్లు, కార్మికులు అందరి సమిష్టి నిర్ణయాలతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ మునిసిపల్ ఛై‌ర్మన్ బండారి అనూష అన్నారు. మంగళవారం పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షాతో సమావేశమ‌య్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ వనరులపై అధికారులు దృష్టి సారించాలని అనూష సూచించారు.

April 1, 2026 / 06:06 AM IST

నేటి నుంచి గ్రామ సభలు

JGL: నేటి నుంచి గ్రామసభలను పెద్దఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జగిత్యాల ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.

April 1, 2026 / 06:06 AM IST

రోడ్డు ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే భరోసా

NLG: దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ప్రమాదాల్లో మరణించిన వారి మృతదేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆసుపత్రి వద్ద ఉన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

April 1, 2026 / 06:00 AM IST

మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు

SRD: 2వ రోజుకు చేరిన జిన్నారం మున్సిపల్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. దాదాపు 75 మంది మున్సిపల్ సిబ్బందికి 6 నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదని  జిల్లా CITU ఉపాధ్యక్షులు బి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగ మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రాలు అందజేసి నిరసన తెలిపమన్నారు.

April 1, 2026 / 05:51 AM IST

వడ్ల కొనుగోలు కేంద్రాలకై కలెక్టర్‌కు వినతి

SRCL: పెద్దూర్ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు మంగళవారం జాయింట్ కలెక్టర్ నగేశ్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. వచ్చే వారం రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్ల కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో మాదిరిగానే ఈసారి పెద్దూర్ సొసైటీకి వడ్ల కొనుగోలు కేంద్రాలను యథావిధిగా కేటాయించాలన్నారు.

April 1, 2026 / 05:13 AM IST

‘అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు’

PDPL: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు నిన్న రాత్రి రూపు నారాయణపేట శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అభిషేకాలను నిర్వహించి, తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

April 1, 2026 / 05:10 AM IST

అనుమానాస్పద మరణంపై మరోసారి పోస్ట్‌మార్టం

NLG: బొప్పారానికి చెందిన అనంతుల లింగయ్య (45) మృతిపై అనుమానాలతో అధికారులు మంగళవారం రీ-పోస్టుమార్టం నిర్వహించారు. గత వారం కడుపునొప్పితో మృతి చెందిన లింగయ్య, పాముకాటు వల్ల చనిపోయాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పరీక్షలు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

March 31, 2026 / 10:04 PM IST

గురుకుల ఘటనపై బాలల హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

NLG: దామచర్ల బీసీ గురుకుల పాఠశాలలో భోజన నాణ్యతపై ప్రశ్నించిన చిన్నారులను ప్రధానోపాధ్యాయురాలు మోకాళ్లపై కూర్చోబెట్టి, భోజనం ఇవ్వకుండా అవమానించడం అత్యంత దారుణమని న్యాయవాది కట్ట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై మంగళవారం ఆయన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డికి అధికారికంగా ఫిర్యాదు చేశారు.

March 31, 2026 / 09:49 PM IST