హైదరాబాద్లోని నాదరుల్లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. 374 ఎకరాల దళిత రైతుల భూములను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వాలు కాపాడిన భూములను ఇప్పుడు దోచుకుంటున్నారని, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల భూములకు రక్షణ లేదని ఆయన మండిపడ్డారు.