తిరుపతి: నాగలాపురం మండలంలోని సర్పంచుల సన్మాన కార్యక్రమం సోమవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక వ్యాపార సంఘం కల్యాణ మండపంలో నిర్వహించనున్నారని మండల అధ్యక్షుడు అపరంజిరాజు తెలిపారు. సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరుకావాలన్నారు.