VZM: బొండపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై మహేష్ సోమవారం మైనర్ వాహన చోదకులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టంపై అవగాహన కల్పించారు. లైసెన్స్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించి, వారితో ప్రతిజ్ఞ చేయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.