TG: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో నిందితుల కస్టడీపై వాదనలు ముగిశాయి. రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మను.. పోలీసులు మరో 5 రోజుల కస్టడీకి కోరారు. ఇప్పటికే 2 సార్లు తీసుకున్నారని, మరోసారి అవసరం లేదని నిందితుల తరఫు న్యాయవాది అన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఉప్పరపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది.