KMM: కల్లూరు మున్సిపాలిటీలో ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనపై 18వ వార్డు కౌన్సిలర్ పెడకంటి కృష్ణయ్య సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్కు ఫిర్యాదు చేశారు. ప్రజా పాలన సభల ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీల ఫోటోలు లేకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే, మున్సిపల్ కార్యాలయంలో రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించడంపై కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.