NRPT: నారాయణపేట మండలం బోయలపల్లి నుంచి బొమ్మన్ పాడు వరకు చేపట్టిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కోటకొండ ఆటో యూనియన్ నేతలు తెలిపారు. శనివారం ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేసి పనులు పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని యూనియన్ నేత రాజు వివరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
NRPT: నారాయణపేట మండలం బోయలపల్లి నుంచి బొమ్మన్ పాడు వరకు చేపట్టిన రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోయాయని కోటకొండ ఆటో యూనియన్ నేతలు తెలిపారు. శనివారం ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేసి పనులు పూర్తి చేయాలని కోరారు. కాంట్రాక్టర్ పనులు నిలిపివేయడంతో రోడ్డుపై ప్రయాణం కష్టంగా మారిందని యూనియన్ నేత రాజు వివరించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
PDPL: రామగుండం కార్పొరేషన్లో విధులు నిర్వహించే మార్గదర్శి స్లమ్ సమాఖ్య శ్రీ సరస్వతి మహిళా పొదుపు సంఘం సభ్యురాలు బూర్గుల అనిత అమృత్ మిత్రగా ఎంపికైంది. ఈనెల 13న న్యూఢిల్లీలో జరిగిన అమృత్ మిత్ర మహోత్సవంలో రాష్ట్రంలోని కార్పొరేషన్లలో పనిచేసే ఐదుగురిలో అనితకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా అనితను పలువురు అధికారులు అభినందించారు.
HYD: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు వెంకట్ రాంరెడ్డి అన్నారు. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో HYD ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అభయహస్తం పేరుతో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఈ అసెంబ్లీ సమావేశాల్లో కార్యచరణ రూపొందించాలన్నారు.
ASF: వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రిని DMHO సీతారాం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాక్సిన్ రూమ్, మందుల స్టోర్, HPV వ్యాక్సిన్ సెంటర్, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటించాల్సిన అవసరాన్ని, పేషెంట్లకు నాణ్యమైన సేవలు అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రి నిర్వహణపై కచ్చితమైన పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు.
WGL: జిల్లా కేంద్రంలో శనివారం రాష్ట్ర మంత్రి కొండా సురేఖను దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, భద్రాచలం ఆలయ ఈవో సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వైభవంగా నిర్వహించనున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు మంత్రి రావాలని ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంలో ఆలయ అర్చకులు ఉన్నారు.
SRPT: గరిడేపల్లి మండలంలోని కేతవారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సర్వారం గ్రామానికి చెందిన కాంతయ్యను గరిడేపల్లి పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ‘FIR ఎట్ డోర్ స్టెప్’లో భాగంగా ఎస్సై నరేష్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించి, అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాపీని అందజేశారు.
MDK: కొల్చారం మండలం రాంపూర్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సందర్శించారు. ముగ్గురు మృతి చెందిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన కాయితోజు దిలీప్(26) అనే యువకుడు ఎంబీఏ చదివినప్పటికీ ఉద్యోగం లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఇంట్లో ఇనుప రాడుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.
NRML: భైంసా మండలలోని గ్యాస్ ఏజెన్సీలలో తహసీల్దార్ ప్రవీణ్, అధికారుల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏజెన్సీ కార్యాలయంలో గల రిజిస్టర్లను పరిశీలించారు. గోదామును పరిశీలించి అక్కడ ఉన్న సిలిండర్లను పరిశీలించారు. గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించవద్దని హెచ్చరించారు. సిలిండర్లను పక్కదారి పట్టించిన, బ్లాక్‌లో అమ్మిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
MLG: వెంకటాపూర్(M)కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ‘ప్రజా పాలన-99 రోజుల ప్రగతి ప్రణాళిక’పై ప్రత్యేక అధికారి సాల్మన్ రాజు, DRDO శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్ణీత గడువులోగా లక్ష్యాలను సాధించాలని వారు సూచించారు. కార్యక్రమంలో MRO గిరిబాబు, MPDO రాజు, SI చల్ల రాజు, సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు ఉన్నారు.
VKB: వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డా.కిరణ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ నెల 16న కుల్కచర్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య నిపుణులతో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, చిన్న పిల్లలు, దంత సమస్యలు, కళ్ల సంబంధిత వైద్య నిపుణులచే వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు.
JGL: ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తండాకు చెందిన మాలవత్ నిఖిల్ నాయక్ ఆంగ్ల భాష విద్య విభాగంలో PHD పట్టా పొందారు. ‘మల్టీ మోడల్ కంపోజిషన్స్ ఇన్ ది ఇండియన్ ఈఎస్ఎల్ క్లాస్ రూమ్’ అనే శీర్షికతో ఆయన సమర్పించిన పరిశోధన గ్రంథానికి దేశంలోనే ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయమైన ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందారు.
MNCL: మంచిర్యాలలోని మహాత్మా జ్యోతిబా పూలే డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించారు. పెద్దపల్లిలో నిర్వహించిన జాబ్ మేళాలో విద్యార్థులు అన్మోల్, యశ్వంత్, ఆకాశ్, హర్షవర్ధన్, వెంకట్, శివమణి ప్రతిభ కనబరిచి ఫార్మా, అపోలో, మెడిప్లస్ కంపెనీల్లో మేనేజర్లుగా ఎంపికయ్యారు.
NZB: ధర్పల్లి మండలం సీతాయిపేట్ తండాకు చెందిన గిరిజన మహిళ కాంతామణి హత్య కేసు వివరాలను ఏసీపీ బీ.ప్రకాష్ స్వయంగా పరిశీలించారు. శనివారం ఘటన స్థలానికి చేరుకున్న ఆయన.. సీఐ బిక్షపతి, ఎస్సై శ్రీనివాస్‌ల నుంచి దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. అలాగే ఓన్నాజీపేట్ గ్రామంలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు వివరాలను సమీక్షించారు.