KNR: గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామ సర్పంచ్ తాడూరి కరుణశ్రీ వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ మహంకాళి ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్‌లో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే వారితోపాటు వార్డు సభ్యులు ఇరుమాండ్ల ఎల్లేష్, అలువాల ప్రదీప్ ఉన్నారు.
MHBD: HYD పటాన్ చెరువు ప్రాంతంలో భార్యాభర్తలు హత్యకు గురైన ఘటనపై దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం పోయిన దంపతులు హత్యకు గురికావడం బాధాకరమన్నారు. పోలీసులు వెంటనే నిందితులను గుర్తించి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 13వ వార్డు కుంట రాములు బస్తీలో రోడ్డు సౌకర్యం కల్పించాలని మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ శనివారం మెమోరండం అందజేశారు. గత 20 ఏళ్లుగా రోడ్డు సదుపాయం లేక బస్తీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని MLAకు వివరించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి 15 రోజులలో రోడ్డు వేయిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
NRML: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. జిల్లాకు వచ్చిన ఆయనకు ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బాసరలో జరిగిన వివిధ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.
KMM: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. నకిలీ వాట్సాప్/SMS లింకులు, తక్షణ డెలివరీ ఆశ చూపి అడ్వాన్స్ డబ్బులు అడగడం, KYC అప్‌డేట్ పేరుతో OTP అడగడం వంటి మోసపూరిత చర్యలకు నేరగాళ్ళు పాల్పడుతున్నారని చెప్పారు. అధికారిక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని కోరారు.
NLG: అప్పుల విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ ఆత్మహత్యకు దారి తీసింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన శిరస్సు కల్పన(33) దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. మృతురాలికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. మృతురాలి తల్లి ఓర్సు ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
GDWL: కల్తీ ఆహారం, నకిలీ ఉత్పత్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆసరా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. అన్యాయ వ్యాపార విధానాలపై వినియోగదారులు ప్రశ్నించాలన్నారు.
MDK: డ్రగ్స్‌కు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దామని తూప్రాన్ SI గంగరాజు పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్‌లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల కార్యక్రమంలో ప్రజలకు అవగాహన చేపట్టారు. ప్రజలు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను ఓపెన్ చేయవద్దని సూచించారు.
NGKL: పదర మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శనివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తక్కువ వోల్టేజ్ సమస్యలు తగ్గి నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MBNR: జడ్చర్ల నియోజకవర్గంలో ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 11 గంటలకు నిర్వహించే పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం మిడ్జిల్ మండలం బోయిన్ పల్లిలో నూతనంగా నిర్మించిన 33/11కేవీ సబ్ స్టేషన్‌ను ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలిపారు.
KMR: జిల్లాలోని పలు వాణిజ్య సంస్థల్లో అక్రమంగా వినియోగిస్తున్న 30 గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలోని నస్రుల్లాబాద్, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, పాల్వంచ, భిక్కనూరు మండలాల్లో పలు హోటళ్లు, మెస్‌లు, వాణిజ్య సంస్థల్లో తనిఖీలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
KNR: గంగాధర మండలం బూరుగుపల్లి గ్రామ స్వశక్తి సంఘం మహిళలు శనివారం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను గంగాధర ప్రజా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గ్రామంలో అదనపు స్వశక్తి సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని మహిళలకు హామీ ఇచ్చారు.
BDK: అశ్వాపురం మండలంలోని జామా మసీదులో నిర్వహించిన పవిత్ర రంజాన్ మాసం ఇఫ్తార్ విందు శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో స్నేహభావం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఓరుగంటి బిక్ష్మయ్య, గాదె కేశవరెడ్డి పాల్గొన్నారు.
ADB: తలమడుగు, బరంపూర్ పదో తరగతి పరీక్ష కేంద్రాలను తహశీల్దార్ రాజ్ మోహన్ శనివారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావుండకూడదని అధికారులను ఆదేశించారు. ఎండల దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు సహా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఆయనతో పాటు ఎస్సై రాధిక, తదితరులు ఉన్నారు.
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు యొక్క సుందరీకరణ పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భూమి పూజ చేయనున్నారని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణ పనులకు రూ. 314 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఆ పనులకు ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని పేర్కొన్నారు.