• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నాగారం చెరువుకు ఎల్లంపల్లి జలాలు.. రైతుల హర్షం

SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని నాగారం చెరువుకు గోదావరి ఎల్లంపల్లి నీరు చేరుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి, పీసీసీ సభ్యులు గడ్డం శ్రీనివాస్, దయ్యాల శీను తదితరులు కాల్వను సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. చాలా కాలం తర్వాత సాగునీరు విడుదల కావడంతో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు.

March 15, 2026 / 08:33 PM IST

‘క్లీన్‌గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి’

PDPL: రామగుండం పట్టణాన్ని క్లిన్‌గ్రీన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా హ్యాపీ సండే నిర్వహించారు. గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద క్లీన్ చేసి, నది తీరంలో ఉన్న చెత్త, ప్లాస్టిక్‌ను తొలిగించారు. మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ పాల్గొన్నారు.

March 15, 2026 / 08:32 PM IST

మున్సిపల్ సిబ్బందికి వైద్య శిబిరం

NGKL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ నందు ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. అందులో భాగంగా మున్సిపల్ సిబ్బందికి హెల్త్ చెకప్ చేసి సరైన మందులు ఇవ్వడం జరిగింది. కార్య క్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ ఛైర్మన్ రెడ్డి జ్యోతి, వైస్ ఛైర్మన్ రహీం పాషా, కౌన్సిలర్స్ శేఖర్, బోరెల్లి మహేశ్ పాల్గొన్నారు.

March 15, 2026 / 08:31 PM IST

గుమ్లాపూర్‌లో ఘనంగా రేణుకా ఎల్లమ్మ పట్నాలు

KNR: గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ పట్నాల ఉత్సవాలు చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటి రోజు మహిళలు పోచమ్మ బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుల్లు, శివ సత్తుల పునకాలతో ఊరేగింపుగా వెళ్లారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోచమ్మ తల్లికి బోనం నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

March 15, 2026 / 08:31 PM IST

గుడిపల్లి రిజర్వాయర్ సందర్శించిన మాజీ మంత్రి

NGKL: జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను ఆదివారం మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డా. నాగం జనార్దన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పరిస్థితిని పరిశీలించి, సాగునీటి విడుదలపై ప్రభుత్వం అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పంటలు చేతికి వచ్చే కీలక సమయంలో రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.

March 15, 2026 / 08:29 PM IST

అంబేద్కర్ యూనివర్సిటీలో TCS iON ప్రోగ్రామ్ అవగాహన

MBNR: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, TCS ION ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్” విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని EMRRC డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ తెలిపారు. ఎంవీఎస్ (MVS ) ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

March 15, 2026 / 08:27 PM IST

‘నేటి తనిఖీలే రేపటి మెరుగైన ఖమ్మానికి పునాది’

ఖమ్మం నగర అభివృద్ధిలో భాగంగా ’99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’ కింద మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య నేడు 23వ డివిజన్‌లో పర్యటించారు. అక్కడ కొనసాగుతున్న పారిశుధ్య, అభివృద్ధి పనులను నిశితంగా పరిశీలించి, పనులన్నీ సకాలంలో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. నేటి తనిఖీలే రేపటి మెరుగైన ఖమ్మానికి పునాది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

March 15, 2026 / 08:26 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వంపై మారబోయిన రవి యాదవ్ ఫైర్

RR: శేరిలింగంపల్లి పాపిరెడ్డి కాలనీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని బీఆర్‌ఎస్ నేత మారబోయిన రవి యాదవ్ మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో పేదల కోసం నిర్మించిన ఈ హాల్.. ప్రస్తుతం పిచ్చిమొక్కలు, ధ్వంసమైన విద్యుత్ పరికరాలు, అపరిశుభ్రతతో నిరుపయోగంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

March 15, 2026 / 08:21 PM IST

దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉండాలి: ఎమ్మెల్యే

NGKL: తాడూర్ మండలం తుమ్మలసూగురు గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించిన శ్రీ వీర నాగమ్మ, ఎల్లమ్మ దేవతల పండుగ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల శ్రేయస్సు, శాంతి సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించారు. అనంతరం గ్రామ పెద్దలు, భక్తులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.

March 15, 2026 / 08:21 PM IST

‘రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం’

NRML: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సోమవారం నుంచి ఒంటి పూట బడులను నిర్వహిస్తున్నట్లు డీఈవో భోజన్న తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులను నిర్వహించాలని, పదో తరగతి పరీక్ష కేంద్రం ఉన్న పాఠశాలలకు మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు.

March 15, 2026 / 08:19 PM IST

‘చట్టాలపై అవగాహనతోనే మోసాల నుంచి రక్షణ’

ADB: వినియోగదారుల చట్టాలపై అవగాహనతోనే మోసాల నుంచి రక్షణ పొందవచ్చునని జిల్లా వినియోగదారుల కమిషన్ జడ్జి జబేజ్ శామ్యూల్ అన్నారు. పట్టణంలోని చాందా గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వినియోగదారులు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరైన ఆధారాలతో జిల్లా కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని శామ్యూల్ కోరారు.

March 15, 2026 / 08:18 PM IST

ఎస్సీ కార్పొరేషన్‌లో సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు

WNP: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వనపర్తి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సిరాజుద్దీన్ అహ్మద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 17 నుంచి 24 వరకు http://obmms.cgg.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయేతర పథకాలకు 21-50 ఏళ్లు, వ్యవసాయ పథకాలకు 21-60 ఏళ్లు ఉన్నవారు అర్హులు అన్నారు.

March 15, 2026 / 08:17 PM IST

పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, కిట్ల పంపిణీ

KMR: నిజాంసాగర్ మండలం వెల్గనూరు గ్రామ పంచాయితీ పరిధిలో ఆదివారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, వారికి PPE కిట్లను అందజేశారు. గ్రామ సర్పంచ్ సాదుపల్లి సువర్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి పాల్గొని, పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు.

March 15, 2026 / 08:14 PM IST

‘మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వైద్యుడిపై కేసు నమోదు’

MHBD: తొర్రూరు విజయలక్ష్మి హాస్పిటల్‌లో జ్వరంతో వచ్చిన మహిళతో డాక్టర్ కిరణ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని తన భర్తకు తెలిపింది. బాధితురాలి భర్త ఇచ్చిన సమాచారం మేరకు సిరి హాస్పిటల్‌కు సీఐ గణేష్, ఎస్సై ఉపేందర్ చేరుకుని బాధితురాలు మాట్లాడిన స్టేట్మెంట్ ఆధారంగా డాక్టర్ కిరణ్ కుమార్‌పై ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

March 15, 2026 / 08:09 PM IST

ఎల్బీ కళాశాలలో ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ

WGL: LB జూనియర్ కళాశాలలో స్పాట్ వ్యాల్యుయేషన్ క్యాంప్‌లో మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. మూల్యాంకన సిబ్బందికి నేడు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించగా, శిబిరాన్ని వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ ప్రారంభించారు. మూల్యాంకనంలో బోర్డు నిబంధనల మేరకు ఎటువంటి తప్పిదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇంటర్ బోర్డు పరిశీలకులు రాజన్న ఉన్నారు.

March 15, 2026 / 08:09 PM IST