• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆరా తీసిన కలెక్టర్

JN: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, ఇతర సంబంధిత అధికారులతో కలిసి జిల్లాస్థాయి గ్యాస్ సరఫరా పర్యవేక్షణ కమిటీ (DLESMC) సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ అమలు, ప్రస్తుత గ్యాస్ సరఫరా, నిల్వల పరిస్థితిపై ఆరా తీశారు.

March 17, 2026 / 05:16 PM IST

అనారోగ్య బాధితులకు అండగా ఎమ్మెల్యే జారే

BDK: అశ్వరావుపేట నియోజకవర్గానికి చెందిన అనారోగ్య బాధితులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అండగా నిలుస్తున్నారు. 65 మంది బాధితులకు సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ భవన్ సచివాలయంలో అధికారులకు అందించారు. సకాలంలో చెక్కులు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

March 17, 2026 / 05:16 PM IST

‘గ్రామ సమైక్య భవనాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి’

SRCL: గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం ముస్కానిపేట గ్రామంలో గ్రామ సమాఖ్య భవన నిర్మాణ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనులు ఎప్పుడు మొదలు పెట్టారో ఆరా తీశారు. కావలసిన కార్మికులు, సామగ్రి సిద్ధం చేసుకోవాలని, భవన నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు.

March 17, 2026 / 05:13 PM IST

సుల్తానాబాద్‌లో 8 సిలిండర్లు సీజ్

PDPL: సుల్తానాబాద్ పట్టణంలో ఇవాళ సివిల్ సప్లై అధికారులు పలు హోటళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు గృహ వినియోగానికి ఉపయోగించే సిలిండర్లను హోటల్లో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీంతో 8 సిలిండర్లు సీజ్ చేసి 5 హోటళ్లపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో పోలీసులు, సివిల్ సప్లై అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:11 PM IST

‘అక్రమ మొరం తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు’

NRML: అక్రమంగా మొరం తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మంగళవారం సారంగాపూర్ మండలం జాం గ్రామ చెరువు సమీపంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మొరం, ఇసుక అక్రమ తవ్వకాలు లేదా రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని అవసరమైతే పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.

March 17, 2026 / 05:10 PM IST

ఈనెల 22న మాల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ

MHBD: జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన మాల ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన సభ ఈనెల 22న జిల్లా కేంద్రంలోని పెరమాండ్ల జగన్నాథం భవనంలో నిర్వహించనున్నట్లు జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిట్టిమల్ల మహేష్ వెల్లడించారు. ఈ సమావేశానికి మాల ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

March 17, 2026 / 05:10 PM IST

ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

WNP: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈవీఎంల నెలవారీ తనిఖీల్లో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ సీల్‌ను తెరిచి తనిఖీ నిర్వహించారు. నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

March 17, 2026 / 05:10 PM IST

‘జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి’

KMM: జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఖమ్మం జిల్లా మీడియా కన్వీనర్ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగుతున్నాయని తెలిపారు. జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల భూమిని సొసైటీలో సభ్యత్వం కలిగిన 320 మంది జర్నలిస్టులకు 200 గజాల చొప్పున పంపిణి చేయాలన్నారు.

March 17, 2026 / 05:08 PM IST

భద్రాచలంలో పర్యటించనున్నSC, ST కమిషన్ ఛైర్మన్

BDK: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య రేపటి నుంచి 3 రోజుల పాటు భద్రాచలంలో పర్యటించానున్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలం పర్ణశాలో రామయ్యను దర్శించుకుంటారు. అనంతరం ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంను సందర్శిస్తారు. 19న ఉదయం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని, పాపికొండల సందర్శనకు వెళ్తారు. 20న హైదరాబాదుకు తిరిగి వస్తారు.

March 17, 2026 / 05:08 PM IST

ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం

BHPL: గోరికొత్తపల్లి మండలం గాంధీనగర్ గ్రామ శివారులో మంగళవారం జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో, సుధాకర్ డ్రిప్ కంపెనీ సహకారంతో ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎరువుల వినియోగం, డ్రిప్ సాగు, మల్చింగ్, పురుగు-వ్యాధి నియంత్రణపై రైతులకు వివరణాత్మకంగా అవగాహన కల్పించారు.

March 17, 2026 / 05:06 PM IST

ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఆందోళన

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ జన్నారం మండల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలో భాగంగా మంగళవారం వారు జన్నారం తాహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. అనంతరం స్థానిక తాహసీల్దార్ రామ్మోహన్‌కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు మధుసూదన్ రావు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:06 PM IST

కలెక్టరేట్‌ను ముట్టడించిన ఆశా వర్కర్లు

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం KMR కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఆశా కార్యకర్తలు నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు ఆశా కార్యకర్తలను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

March 17, 2026 / 05:04 PM IST

ఘనంగా మెట్రో ఉగాది ఫెస్టివల్

హైదరాబాద్ మెట్రో అధికారులు, సిబ్బంది అందరు కలిసి మెట్రో ఫెస్టివల్ పేరిట ముందస్తుగా ఉగాది పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ కళారూపం నృత్య ప్రదర్శనలు అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరూ.. తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకున్నారు. ఉప్పల్ డిపో నుంచి ఇంజనీర్లు రవి ప్రకాష్ , నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:03 PM IST

చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ADB: తలమడుగు మండల కేంద్రంలో కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో చలివేంద్రాన్ని స్థానిక అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ మోహన్, ఎంపీడీవో శంకర్, తదితరులున్నారు.

March 17, 2026 / 05:03 PM IST

పాఠశాలల్లో మౌలిక వసతులపై రాజీ పడొద్దు: కలెక్టర్

GDWL: జిల్లాలోని KGBV పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని,అనుమతి లేని వారిని పాఠశాలల్లోకి రానివ్వకూడదని స్పష్టం చేశారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీరు, నాణ్యమైన ఆహారం అందించడంలో ప్రిన్సిపాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

March 17, 2026 / 05:01 PM IST