NLG: భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారి ఉరితాళ్లను ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు నిజమైన దేశభక్తులని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు అవిశెట్టి శంకరయ్య కొనియాడారు. చిట్యాలలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ వర్ధంతి సభను నిర్వహించి నివాళులు అర్పించారు.
BHNG: వలిగొండ మండల కేంద్రంలో సీపీఎం పార్టీ తీర్పాంగి స్వామి ఆధ్వర్యంలో దేశ స్వాతంత్య్ర కోసం చిరుప్రాయంలో ఉరి కంభమెక్కి తమ ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 95వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. భగత్ సింగ్ చేసినటువంటి గొప్ప పనులను ఆయన స్మరించుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భిక్కనూర్‌లో అత్యధికంగా 37.1°C నమోదవగా, కొల్లూరు, ఎలుపుగొండ, నాగిరెడ్డిపేట్, బీర్కూర్, మాచాపూర్ ప్రాంతాల్లో 36°Cకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దోమకొండ 35°C నమోదు కాగా మిగతా ప్రాంతాల్లో 32°C నుంచి 35°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని కేసముద్రం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ అల్లం రమా నాగేశ్వరరావు కలిశారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను రాజ్యసభ సభ్యుడికి వైస్ ఛైర్మన్ వివరించి కేసముద్రం సమగ్ర అభివృద్ధికి పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
KMR: మద్నూర్ మండలం సుల్తాన్ పేట్‌లో ముస్లిం సోదరుడు హనుమాన్ దీక్ష స్వాములకు భిక్ష (అన్నదానం) నేడు ఏర్పాటు చేసి మత సామరస్యతను చాటారు. గ్రామానికి చెందిన మహ్మద్ ఉస్మాన్ ప్రతి సంవత్సరం లాగే హనుమాన్ దీక్ష స్వాములకు బిక్షను ఏర్పాటు చేశారు. హనుమాన్ దీక్ష స్వాములు మహ్మద్ ఉస్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
GDWL: భారత్-అమెరికా వ్యవసాయ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం గద్వాల మండలం చెనుగోనిపల్లిలో రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 29 కార్మిక చట్టాలను పూర్తిగా తొలగించాలన్నారు. విత్తన బిల్లును అమలు చేస్తే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
KNR: సైదాపూర్ పెద్ద చెరువు తూమును గుర్తుతెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తెరవడంతో భారీగా నీరు వృథాగా పోవడం మొదలైంది. ఈ విషయం సైదాపూర్ సర్పంచ్ స్వప్న దృష్టికి రావడంతో వెంటనే ఆమె అప్రమత్తమయ్యారు. గ్రామస్థులతో హుటాహుటిన చెరువు వద్దకు చేరుకున్నారు. అందరూ కలిసి శ్రమించి, తెరిచి ఉన్న తూమును వెంటనే మూసివేయించారు.
SRD: పటాన్ చెరువు పారిశ్రామిక వాడలోని తోషిబా పరిశ్రమ యాజమాన్యంతో కార్మికులు కార్మికులకు మేలు జరిగే విధంగా చారిత్రాత్మకమైన ఒప్పందం జరిగిందని తోషిబా పరిశ్రమ యూనియన్ అధ్యక్షులు మల్లికార్జున్ తెలిపారు. తోషిబా పరిశ్రమకు,CITUకు 25 సంవత్సరాల బంధం ఉన్నదని అన్నారు. CITU పారిశ్రామిక వాడలలో దూసుకుపోతూ జెండా ఎగరవేస్తున్నదని అన్నారు.
PDPL: GM ఆఫీస్ ప్లే గ్రౌండ్‌లో హుయాన్ చుంగ్ కుంగ్ ఫూ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బెల్ట్ టెస్ట్ నిర్వహించారు. మాస్టర్ రాజేశం పర్యవేక్షణలో విద్యార్థులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ప్రతిభకనబరిచిన 10 మందికి ఎల్లో బెల్టులు, 4గురికి బ్రౌన్ బెల్టులు, సర్టిఫికేట్లను ప్రెసిడెంట్ &చీఫ్ ఎగ్జామినర్ మాస్టర్ రాజేశం చేతుల మీదుగా అందజేశారు.
MDK: బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు “ఛలో అసెంబ్లీ” కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ముట్టడి బయలు దేరిన బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షుడు సతీష్‌తో పాటు బీజేపీ నాయకులను సోమవారం మెదక్ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచక, మోసపూరిత పరిపాలన నిరసనగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిని ముందస్తు అరెస్ట్ చేయడం అన్యాయం అన్నారు.
HNK: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ స్వయంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ధరణి, పెన్షన్లు, రేషన్ కార్డులకు సంబంధించిన అర్జీలను వెంటనే పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
KMR: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ‘ప్రజావాణి’ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ మధు మోహన్ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజలు సమస్యల పైన ఇచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించి తొరగతిన పూర్తి చేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చందర్ ఏవో ఉన్నారు.
NRML: 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి సోమవారం తెలిపారు. ఎంపికలు మూడు దశల్లో జరుగుతాయనీ, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు మార్చి 28న నిర్మల్‌లో జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
MBNR: మిడ్జిల్ మండలంలోని లింబ్యతండాలో సోమవారం పశువైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో పాడి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. గ్రామ సర్పంచ్ మన్ని శంకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ జీవాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలని అధికారులు కోరారు.
SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ర్యాలీ, మానవహారం ద్వారా నీటి సంరక్షణపై నినాదాలు చేశారు. నీటిని పొదుపుగా వినియోగించాలని సర్పంచ్ బోయిని సంపత్ సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.