MHBD: ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు గంజి ఉప్పల్ రెడ్డి తన మూడెకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. వేసవికాలం రాకముందే భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బావుల్లో నీరు లేక రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో చేసేదేమిలేక గంటకు రూ.5వేలు వెచ్చించి, 10 గంటలకు రూ.50 వేలు ఖర్చు చేసి పొక్లైనర్ సహాయంతో పూడిక తీసినట్లు తెలిపారు.
KNR: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా గొర్రెల మేకల పెంపక దార్ల సంఘం డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కాలువ సురేష్ యాదవ్, శంకరపట్నం మండల అధ్యక్షులు కేశవేణి రవీందర్ యాదవ్, గౌరవ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
HNK: హన్మకొండలో మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పరిశీలించారు. మున్నూరుకాపు భవనం గ్రౌండ్ లెవల్ పనులు పూర్తైన క్రమంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం చేపట్టాలని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
MBNR: బ్రిస్బేన్‌లో నిర్వహించనున్న ‘ICS మల్టీకల్చరల్ ఈవెంట్ 2026’కు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్‌కు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానం అందింది. నివాసంలో ICS క్వీన్స్‌లాండ్ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఆహ్వాన పత్రికను అందజేశారు. తెలుగు సంస్కృతిని విదేశాల్లో చాటిచెప్పేలా కార్యక్రమం రూపొందించినట్టు పేర్కొన్నారు.
జగిత్యాల మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులుగా కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని కోరుతూ సేవాదళ్ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజెంగి నందయ్యను కలిశారు.ఈ సందర్భంగా సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ముకేశ్ ఖన్నా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విజయాల్లో సేవాదళ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సేవా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రం అందజశారు.
NGKL: కల్వకుర్తిలో BJYM నాయకులను శనివారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని గాంధీ భవన్ ముట్టడికి BJYM రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అరెస్టు అయినవారిలో ధన్నోజు నరేష్ చారి, కుంభం చందు ముదిరాజ్, రాజశేఖర్, వంశీ, శివ ఉన్నారు. కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. BJYM శ్రేణులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిని కాయకల్ప టీం వైద్యాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గల వసతులు, పరిశుభ్రతను పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వాంకిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ హర్షవర్ధన్, సిబ్బంది ఉన్నారు.
GDWL: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీష్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి హృదయ రాజును కలిసి వినతిపత్రం అందజేశారు. పరీక్ష గదుల్లో విద్యుత్, ఫ్యాన్లు, తాగునీరు, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.
SRCL: పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి.. రాయాలని, ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు.
జనగామ 3వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన బూడిది జ్యోతి గోపి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, నేతలను కలిశారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని జాన్ వెస్లీ కౌన్సిలర్‌కు సూచించారు. కార్యక్రమంలో పలువురు జిల్లా నేతలు పాల్గొన్నారు.
MLG: మహిళల ఆర్థిక సాధికారతే తెలంగాణ ప్రగతి అని మంత్రి సీతక్క అన్నారు. జాతీయ ఆర్థిక సాక్షరత సదస్సులో మంత్రి సీతక్క పాల్గొని మహిళా సాధికారతలో తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతిని ఆవిష్కరించారు. మహిళలను ఆర్థికంగా స్థితిమంతులుగా చేయడానికి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.
HYD: చంచల్‌గూడ సెంట్రల్ జైలు వేదికగా ఉగ్రకుట్ర జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా వదంతులేనని జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్ధారణ లేని వార్తలు ప్రసారం చేయవద్దని, ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని గుర్తు చేశారు. జైలులో లష్కర్-ఏ-తోయిబాకు చెందిన జాహిద్ అనే ఖైదీ ఒక్కరే ఉన్నాడని డీఐజీ శ్రీనివాస్ తెలిపారు.
MNCL: విద్యార్థుల మంచి భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలను జన్నారం మండలంలోని లోతరే గ్రామ సర్పంచ్ బోడ శంకర్ సూచించారు. శనివారం లోతరేలో పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మంచి విద్యకు పెట్టింది పేరు ప్రభుత్వ పాఠశాలలని స్పష్టం చేశారు. విద్యార్థుల మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.
NLG: దేవరకొండలోని రాంనగర్ 16వ వార్డుకు చెందిన రెడ్డి కోటేశ్వరరావు నియోజకవర్గ బీసీ సంఘం యువజన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీకాలం రెండు సంవత్సరాలు కొనసాగుతుందని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
BDK: మద్యం వ్యాపారుల కనుసన్నల్లో నడుస్తున్నా బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ రాజు దొర డిమాండ్ చేశారు. శనివారం నాయకులతో సమావేశమై మాట్లాడుతూ.. అధికారులు స్పందించకుంటే ఆదివాసీ నాయకులకు కలిసి చర్ల మండలంలోని ఏజెన్సీ ఆదివాసీ గ్రామల్లో ఉన్న బెల్ట్ షాపులుపై దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.