WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మ గుడి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ శ్రీహరి రూ.5,016 విరాళంగా అందజేశారు. మంగళవారం పెద్దమ్మ గుడి కమిటీ సభ్యులు అట్టి విరాళంను అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.
KMR: మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కౌన్సిల్ ఆగ్రహానికి గురైన కమిషనర్ రాజేందర్ రెడ్డి బడ్జెట్ సమావేశం జరిగిన శనివారమే సెలవుపై వెళ్లారు. అయితే అప్పటివరకు KMR ఆర్డీఓగా నూతనంగా వచ్చిన ఎన్ వై గిరి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన మంగళవారం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
MDK: జిల్లాలో యువత ఐపీఎల్ బెట్టింగ్లకు దూరంగా ఉండాలని ఎస్సై నారాయణ గౌడ్ హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల డబ్బులు కోల్పోవడమే కాకుండా, క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. బెట్టింగ్లపై పోలీసులు నిఘా ఉంచారని, క్రీడలను వినోదంగా చూడాలి తప్ప వ్యసనంగా మార్చుకోవద్దని సూచించారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
NZB: బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మాధవనగర్ ఆర్వోబీ వద్ద సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నగరంలోని సుభాష్‌నగర్‌కు చెందిన అనురాగ్ (18) సోమవారం అర్ధరాత్రి మాధవనగర్ వద్ద బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్చగా మంగళవారం చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు.
MHBD: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లికుదురు మండలం వావిలాల ఉమ్మడి ఫీల్డ్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ మధుసూదన్ రాజ్ తెలిపారు. గత శనివారం మొదటి పెట్టిన 16వ విడత సామాజిక తనిఖీల్లో మిగిలిన 6 గ్రామాల సామాజిక తనిఖీ నిన్న రైతు వేదికలో నిర్వహించారు. మొత్తం 31 గ్రామాలల్లో రూ. 7,085,71 రికవరీకి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
PDPL: పాలకుర్తి మండలం కుక్కలగూడూర్లో మంగళవారం తెల్లవారుజామున ఈదురు గాలులు, అకాల వర్షంతో పెట్రోల్ బంక్ సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై కూలింది. కుక్కలగూడూరు–పొట్యాల మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల కూడా చెట్లు విరిగినట్లు సమాచారం. అధికారులు వెంటనే తొలగించాలని గ్రామస్థుల విజ్ఞప్తి చేస్తున్నారు.
NZB: బాల్కొండ మండలం బస్సాపూర్‌లో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ పొలంపల్లి శ్రీనివాస్ పంపిణీ చేశారు. లబ్ధిదారులు రాజేందర్‌కు రూ.60 వేలు, లింభన్నకు రూ.60 వేలు, భీమన్నకు రూ.32 వేల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వం, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సునీల్ కుమారు కృతజ్ఞతలు తెలిపారు.
MDCL: మల్కాజ్‌గిరి ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో లేవని అక్కడికి వెళ్లిన రోగులు చెబుతున్నారు. ముఖ్యంగా HbA1c వంటి కీలక పరీక్షలు కొన్ని సందర్భాల్లో నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల మధుమేహం వంటి వ్యాధుల నిర్ధారణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
KMR: గడచిన 24 గంటల్లో జిల్లాలో నమోదైన వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి 10.8 మి.మీ, పాత రాజంపేట 9.5, కామారెడ్డి(IDOC) 9, జుక్కల్ 7.5, సోమూరు 7, బిచ్కుంద 6, మేనూరు 5.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా 8 చోట్ల మినహాయించి జిల్లా అంతటా వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు సైతం కొనసాగుతున్నాయి.
MDCL: ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC) వద్ద సర్వికల్ క్యాన్సర్ నివారణకు HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించినట్లు డాక్టర్ సౌశీల్య రాణి తెలిపారు. మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న పరిస్థితిని గమనించిన ప్రభుత్వం, క్యాన్సర్ రాకుండా బాలికలకు ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తుంది.
HYD: రోడ్డు ప్రమాదాల్లో హెడ్ ఆన్ కొలీజియన్ కేసులే అత్యధిక ప్రాణనష్టానికి కారణంగా అధికారులు వెల్లడించారు. వాహనం, వాహనం ఢీకొన్న సందర్భాలు, వాహనం, పాదచారి ఢీకొన్న ఘటనల్లో సుమారు 80 శాతం వరకు మరణాలు నమోదవుతున్నట్లు HYD ట్రాఫిక్ టీం గుర్తించారు. వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలంలో తాగునీటి సమస్య రాకుండా పాలకవర్గం సభ్యులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలోని నాలుగో వార్డ్ బీసీ కాలనీలో మంగళవారం నూతన బోరుబావి తవ్వకం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ బహిరంగ స్వప్న ఆధ్వర్యంలో బోరుబావి తవ్వకాన్ని ప్రారంభించారు. పుష్కలంగా మీరు రావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
SRPT: తిరుమలగిరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ మిషన్ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంపును మంగళవారం మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
HYD: చిన్న వయసులోనే పిల్లల్లో కంటిచూపు తగ్గుతుందని HYD మాజీ ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు తెలిపారు. వివిధ పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించిన ఆయన, విటమిన్-A డెఫిషియన్సీ గుర్తించినట్లుగా వివరించారు. అంతేకాక పిల్లలు డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉండటం మంచిదని, విటమిన్-A కోసం క్యారెట్, ఫిష్ తదితర ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏప్రిల్ 5 వ తేదీ ఆదివారం రోజున నిర్వహించనున్న హిందుసమ్మెలన కార్యక్రమంను విజయవంతం చేయాలనీ హుస్నాబాద్ హిందూచైతన్య సమితి సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం బుడిగేజంగాల సంఘం, రెడ్డి సంఘం,రజక సంఘం, హమాలీ సంఘం సభ్యులను కలిసి వారికి కరపత్రం అందించి కార్యక్రమానికి ఆహ్వానించారు.