• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్ బదిలీ

MBNR: జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున గౌడ్‌ను హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విధి నిర్వహణలో నేరాల నియంత్రణతో పాటు, పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆయన ప్రజల మన్ననలు పొందారు. ప్రస్తుతం ఈ స్థానంలో కొత్తగా ఎవరూ బాధ్యతలు చేపట్టలేదు.

April 1, 2026 / 12:31 PM IST

ఆన్‌లైన్ ద్వారానే ఇసుక: కలెక్టర్

WNP: జిల్లాలో ప్రభుత్వ అవసరాలకు, గృహ నిర్మాణానికి ఇసుక సరఫరాకు ఏప్రిల్ 1 నుండి ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి మాన్యువల్ కూపన్‌లు జారీ చేయరాదని తహసీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మాన్యువల్ కూపన్‌లు ఇసుక సరఫరాకు జారీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

April 1, 2026 / 12:31 PM IST

మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ

SRPT: వేసవి ఎండల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెల్ల రేషన్ కార్డు దారులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన మూడు నెలల బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకే సారి పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కోదాడ లోని 7వ, 8వ వార్డుల్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని వార్డుల కౌన్సిలర్లు చైతన్య నాయక్, ఉదయశ్రీ హరిప్రసాద్‌లు ప్రారంభించారు.

April 1, 2026 / 12:30 PM IST

రేపు మండల కేంద్రానికి షబ్బీర్ అలీ రాక

KMR: దోమకొండ మండల కేంద్రానికి గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రానున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి తెలిపారు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

April 1, 2026 / 12:30 PM IST

హాస్టల్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ

GDWL: జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు సంఘం హాస్టల్ భవన నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. రూ.50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవనం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

April 1, 2026 / 12:28 PM IST

రాపోల్లో ధర్నా చేపట్టిన గ్రామస్తులు

VKB: పరిగి మండలం రాపోల్ గ్రామస్తులు తమ భూములు లాక్కుని ప్రభుత్వం ఇండస్ట్రీయల్‌కు అప్పగించవద్దంటూ బుధవారం ధర్నా చేశారు. పరిగి-షాద్‌నగర్ రహదారిపై బైఠాయించిన రైతుల నిరసనతో వాహనాలకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను సమదాయించే ప్రయత్నం చేస్తున్నారు.

April 1, 2026 / 12:24 PM IST

జిల్లా కలెక్టరేట్ ఎదుట బ్లాక్ డే నిరసన

ADB: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాలు ‘బ్లాక్ డే’ నిర్వహించాయి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన హోరెత్తించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మిక చట్టాలను యథాతథంగా కొనసాగించాలని కోరారు.

April 1, 2026 / 12:23 PM IST

హనుమాన్ ఆలయానికి మకర తోరణం బహూకరణ

KNR: ఐతుపల్లి గ్రామంలోని చర్ల హనుమాన్ దేవాలయానికి భక్తులు, హనుమాన్ దీక్షాపరులు కలిసి సుమారు రూ. 50 వేల విలువైన మకర తోరణాన్ని బహూకరించారు. భక్తుల చందాలతో తయారు చేయించిన ఈ తోరణాన్ని బుధవారం స్వామివారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

April 1, 2026 / 12:23 PM IST

ఈ నెల 30 వరకు జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు

SRCL: శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని *పోలీస్ యాక్ట్ 1861* ప్రకారం నెల రోజులు *(ఏప్రిల్ 1వ తేది నుంచి 30 తేదీ వరకు)* జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరదన్నారు.

April 1, 2026 / 12:21 PM IST

అన్ని గ్రామ పంచాయతీలో గ్రామసభలు : ఎంపిడిఓ

SRD: కంగ్టి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో గురువారం ప్రజా పాలన – ప్రణాళికపై 99 రోజుల ప్రణాళిక గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపిడిఓ సత్తయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని చెప్పారు. కావున ప్రతి ఒక్కరు తమ తమ గ్రామ పంచాయతీలలో గ్రామస్తులకు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

April 1, 2026 / 12:20 PM IST

ఉద్యోగాల నియామక పత్రాలు ఎప్పుడు?

SRD: జిల్లా వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జాప్యంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 117 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, 1:2 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసినా.. ఇప్పటివరకు తుది నియామకాలు చేపట్టలేదు. ప్రతిరోజూ కార్యా లయం చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుంచి స్పందన లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

April 1, 2026 / 12:16 PM IST

కార్మిక చట్టాల పునరుద్ధరణకు డిమాండ్

MBNR: కేంద్రం రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ చౌరస్తాలో CITU, INTUC తదితర సంఘాలు నిరసన తెలిపాయి. 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని CITU జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కాలరాసే విధానాలకు వ్యతిరేకంగా ‘బ్లాక్ డే’ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు.

April 1, 2026 / 12:15 PM IST

పేదల వైద్య చికిత్సకు రూ.2.50 లక్షల ఎల్వోసీ అందజేత

JGL:పేదల వైద్య చికిత్సకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని 32వ వార్డుకు చెందిన కోనపురం సత్తమ్మ అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ నేపద్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2.50 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించి కుటుంబ సభ్యులకు అందజేశారు. అవసరమైన వారికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఆయన తెలిపారు.

April 1, 2026 / 12:14 PM IST

హన్మకొండలో రేపు భారీ జాబ్ మేళా

హన్మకొండలోని ములుగు రోడ్డు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ITI) ప్రాంగణంలో ఏప్రిల్ 2వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ చందర్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత పత్రాలతో నిర్ణీత సమయంలోగా వేదిక వద్దకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

April 1, 2026 / 12:09 PM IST

లబ్ధిదారుకు చెక్కు అందించిన ఎమ్మెల్సీ

SRD: మునిపల్లి మండలం మేళాసంఘం గ్రామానికి చెందిన పడమటి పర్వయ్య కు CMRF ద్వారా మంజూరైన రూ.18000 చెక్కును ఎమ్మెల్సీ అంజిరెడ్డి లబ్ధిదారునికి నేడు అందజేశారు. పేదల ఆసుపత్రి ఖర్చులకు సీఎంఆర్ ఎంతో ఆసరా అవుతున్నదని ఆయన పేర్కొన్నారు. దీన్ని సద్వినియం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 1, 2026 / 12:09 PM IST