MHBD: పేద కుటుంబాలను ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ను అందజేస్తుందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె ఇవాళ తొర్రూరు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్థిదారులకు పంపిణీ చేశారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వమని తెలిపారు.
NZB: టీయూ పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యార్థుల రెగ్యులర్ 2, 4, 6, బ్యాక్ లాగ్ 1, 3, 5 (2021 నుంచి 2025 వరకు) సెమిస్టర్ల పరీక్ష ఫీజుల గడువును మళ్లీ పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఇది వరకే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించామని పేర్కొన్నారు. ఈ నెల 8లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్నారు.
NZB: టీయూ పరిధిలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యార్థుల రెగ్యులర్ 2, 4, 6, బ్యాక్ లాగ్ 1, 3, 5 (2021 నుంచి 2025 వరకు) సెమిస్టర్ల పరీక్ష ఫీజుల గడువును మళ్లీ పొడిగించినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఇది వరకే పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించామని పేర్కొన్నారు. ఈ నెల 8లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్నారు.
SRCL: ఇందిరమ్మ ఇంటితో పేదవాడికల నెరవేరిందని మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ అన్నారు. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లిలో రంగు వనజ బాలయ్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నాయకులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింగం మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో లబ్ది పొందుతున్నాడు అన్నారు.
BDK: కాంట్రాక్ట్ కార్మిక సంఘాల JAC ఆధ్వర్యంలో 12వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. సోమవారం జరిగిన ఈ దీక్షలో వేతన ఒప్పంద చర్చలు JACతోనే జరపాలని కన్వీనర్ పాటి సోమిరెడ్డి డిమాండ్ చేశారు. సింగరపు సతీష్, కోడూరు శ్రీనివాసరావు, సందిపాము బాబు, మేకల శేషమ్మ, పడాల మధు, గూడూరు సత్యవతి ఈ నిరసనలో పాల్గొన్నారు. చర్చలు జరపకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
KNR: చొప్పదండి మండల విద్యాధికారినిగా జి.జ్యోతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎంఈవోగా పనిచేసిన పి.మోహన్ ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో వెదురుగట్ట జడ్పీ హైస్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న జ్యోతి ఎంఈవోగా బదిలీపై వచ్చారు. కాగా, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మండల ఉపాధ్యాయులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
NGKL: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం వెల్దండ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కే. యాదగిరి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడారు.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.
NLG: చింతపల్లి మండలం మదనాపురం(సాగర్ రోడ్డు)లో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
NGKL: హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య కరమైన జీవన విధానాన్ని అవలంబించడానికి సరైన పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు.
NRML: పెంబి మండలం పుల్గం పాండ్రికి చెందిన లావుడ్య రమేష్ కుమార్తె హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆమెను పరామర్శించారు. ఈ మేరకు ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు.
SRCL: చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కట్కూరి ముఖేష్ మాట్లాడారు. పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యను బోధించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
SRD: జిల్లాలో వ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగింది. సోమవారం మధ్యాహ్నం వాతావరణ శాఖ వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో జిన్నారం 36.0 డిగ్రీలు, గుమ్మడిదల 34.3 డిగ్రీలు, అమీన్పూర్ 35.9 డిగ్రీలు, రామచంద్రాపురం 35.3 డిగ్రీలు, పటాన్ చెరులో 35.6° ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 36.2%గా ఉంది.
SDPT: బెజ్జంకి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే గుడ్లు, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని నిరంతరం వినియోగించుకోవాలని సూచించారు. వాటి ద్వారా తల్లి, శిశు ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. పిల్లల బరువు, ఎత్తును క్రమంగా పరిశీలించాలని చెప్పారు.
ASF: జిల్లా కలెక్టర్ కె.హరిత, అదనపు కలెక్టర్‌తో కలిసి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ (NSS) ర్యాలీలో పాల్గొన్నారు. ఐడీవోసీ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. సామాజిక సేవ, ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం అని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
NGKL: చారకొండ మండలం ఎర్రవల్లి, ఎర్రవల్లితండా వాసులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 126వ రోజుకు చేరుకున్నాయి. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రాథమిక నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి తమ ఊర్లను ముంపు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.