SRCL: నాగర్ కర్నూలు జిల్లాలో రజక కుటుంబానికి చెందిన పసిపాపను హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రజక సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్లలో జిల్లా కేంద్రంలో మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ, దిష్టిబొమ్మ దహనం దహనం చేశారు. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని నాయకులు కోరారు.
KNR: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం పెగడపల్లి మండలంలో పర్యటించనున్నారు. పెగడపల్లి కేంద్రంతో పాటు ఐతుపల్లిలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాలను ఆయన ప్రారంభించనున్నట్లు ఏఎంసీ ఛైర్మన్ రాములుగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
SRPT: ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగిన కాలు రైతు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్సై మోహన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణానికి చెందిన నరసయ్య వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులు మందు తాగినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు తెలిపారు.
MDCL: మేడ్చల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఆటోమేషన్ రంగం వేగంగా విస్తరిస్తుండటంతో PLC ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తయారీ యూనిట్లు, ఫార్మా కంపెనీలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అధిక సంఖ్యలో నిపుణులను నియమించుకుంటున్నాయి. పరిశ్రమల్లో యంత్రాల ఆటోమేటిక్ నియంత్రణ, ప్రొడక్షన్ లైన్ల మానిటరింగ్ కోసం PLC నైపుణ్యం కీలకంగా మారింది.
SDPT: జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. నేటి నుంచి ఏప్రిల్ 18 వరకు జరగనున్న ఈ పరీక్షలపై CS నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. జిల్లాలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు.
MHBD: భూసార మట్టి పరీక్షలపై నెల్లికుదురు మోడల్ స్కూల్‌లోని 8, 9 తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. పంటల దిగుబడి పెంపుతో పాటు నేల ఆరోగ్యం పరిరక్షణకు మట్టి పరీక్షలు ఎంతో కీలకమన్నారు. సరైన విధానంలో మట్టి నమూనాలు సేకరించి, పరీక్షలు చేయడం ద్వారా రైతులు అవసరమైన ఎరువులను వాడవచ్చని తెలిపారు.
BHPL: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ లేకుండా ఉక్కుపాదం మోపాలని MLA గండ్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం IDOC కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్, TGMDC, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్, TGMDC శాఖలతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
SRPT: సూర్యాపేట జిల్లాలో ఉగాది నాటికి ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ADB: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేశ్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు నిన్న పట్టణంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలు, పలు అంశాలపై ఎంపీతో చర్చించగా సానుకూలంగా స్పందించినట్లు సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TGO జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, జిల్లా కార్యదర్శి రమణాచారి, తదితరులు ఉన్నారు.
ASF: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ITDA ప్రాజెక్టు అధికారి యువరాజ్ మార్మాట్ ఉపాధ్యా యులను ఆదేశించారు. ఆసిఫాబాద్ బాలికల ఆశ్రమ పాఠశాల, సిర్పూర్ ఈఎంఆర్ఎస్, కాగజ్ నగర్ బాలుర పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. పదో తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించాలని, విద్యార్థులకు మెరుగైన భోజనం, వైద్యం అందించాలని సూచించారు.
MNCL: పంటలు పండిస్తున్న రైతుల కోసం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని TGNPDCL మంచిర్యాల SE రాజన్న వెల్లడించారు. రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా TGNPDCL పని చేస్తుందన్నారు. మంచిర్యాల పరిధిలో డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు 429 వ్యవసాయ విద్యుత్ సర్వీసులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
SRD: జిల్లాలో ఇంటర్ పరీక్షల సందర్భంగా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరూ సెల్ఫోన్లను అనుమతించవద్దని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
WGL: వర్ధన్నపేట పట్టణంలోని అల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవం కార్యక్రమం మంగళవారం సాయంత్రం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా MLA KR నాగరాజు హాజరై, మాట్లాడారు. “మత్తు వదలండి – మైదానానికి రండి.. మత్తు వదలండి – చదువుతో సత్తా చాటండి” అనే నినాదం రేపటి తరానికి ప్రాణవాయువు కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
NZB: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ సంఘం ఆదేశాల మేరకు జిల్లా సైక్లింగ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అడ్వకేట్ శరత్ చంద్ర బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఎన్నికల్లో కృపాకర్ రెడ్డి జిల్లా సైక్లింగ్ సంఘం అధ్యక్షుడిగా, భూలోక విజయకాంత్ రావు ప్రధాన కార్యదర్శిగా, సురేందర్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
MLG: దేవాదుల ఎత్తిపోతల పథకంకు సంబంధించిన విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.1,332 కోట్లకు చేరాయి. వేసవి ప్రారంభంతో గోదావరి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు మోటార్లు నిరంతరం నడవాల్సి ఉండటంతో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రోజుకు 20మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుండగా, రోజుకు దాదాపు రూ.1కోటి, నెలకు రూ.30 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనా.