NRML: నిర్మల్ కలెక్టరేట్లో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పాపన్న గౌడ్‌ను పీడిత వర్గాల కోసం పోరాడిన మహానీయుడిగా కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
KNR: కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజానికి పాపన్న గౌడ్ అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన పోరాట స్ఫూర్తిని అందరూ స్మరించుకోవాలని కోరారు.
BDK: తెలంగాణ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. స్కూటీలు, వీల్చెయర్లు, ట్రై సైకిళ్లు అందజేశారు. రూ. 28.70 లక్షల విలువైన ఉపకరణాలు 35 మందికి పంపిణీ చేశారు. అలాగే స్వయం ఉపాధి కోసం చెక్కులు ఇచ్చారు.
MDK: పెద్ద శంకరంపేట పౌరసరఫరాల గోదామును జిల్లా సివిల్ సప్లై డీఎం జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని అన్ని దుకాణాలకు మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం సరఫరా ఎంతవరకు అందించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని రేషన్ దుకాణాలకు మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యం సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
SDPT: చిన్నకోడూరు మండలం గంగాపూర్ లోని మిర్చి మార్కెట్ ను ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్ గురువారం పాలకవర్గ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా రైతులతో మార్కెట్ యార్డ్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న టాయిలెట్స్ పూర్తి చేసేలా, తాగునీటి సౌకర్యం కల్పించేలా కృషి చేస్తామన్నారు.
NGKL: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి వార్డు సభలు నిర్వహించినట్లు గురువారం మున్సిపల్ ఛైర్ పర్సన్ బృంగి రత్నమాల అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 7,16,17,8,9,10 తదితర వార్డులలో జరిగిన వార్డు సభలలో ఆమె పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
HNK: రాబోయే GWMC ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. 43వ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆరూరి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ప్రజలంతా తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు.
WGL: నగరంలోని BRS కార్యాలయంలో వర్ధన్నపేట నియోజకవర్గం 40వ డివిజన్ కార్యకర్తల సమావేశంలో మాజీ సీఎం A. రమేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయిందన్నారు. గతంలో KCR హయాంలోనే సమగ్ర అభివృద్ధి జరిగిందని, ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి చిరునామా KCR అన్నారు.
MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో అంగన్‌వాడీ టీచర్లకు 5జీ స్మార్ట్ ఫోన్లను మంత్రి సీతక్క ఇవాళ పంపిణీ చేశారు. చిన్నారుల డేటా, గర్భిణీలు, బాలింతల వివరాలు డిజిటల్‌గా నమోదు చేయనున్నారు. జిల్లాలో మొత్తం 545 మంది టీచర్లకు ఫోన్లు అందించారు. అంగన్వాడీ సేవలను మరింత మెరుగుపరచడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.
VKB: గ్యాస్ సిలిండర్లు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తూ గురువారం సిలిండర్ల కోసం రోడ్డుపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కుల్కచర్లలోని భారత్ గ్యాస్ ఏజెన్సీ ముందు ప్రజలు రోడ్డుపైన కూర్చొని నిరసన తెలిపారు. అందుబాటులో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. సిలిండర్లు ఇచ్చేవరకు రోడ్డుపై కదిలేదన్నారు.
NZB: కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ పంచాయతీ కార్యాలయంలో గురువారం జాతీయ అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుల దినోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన కమ్మర్ పల్లి 108 అంబులెన్స్ వాహనం అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు సుంకరి విజయ్ కుమార్‌ను ఘనంగా సత్కరించారు. గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, కమ్మర్ పల్లి PHC వైద్యులు తదితరులు అభినందించారు.
NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలోని పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఆర్‌జేడీ సత్యనారాయణ గురువారం సందర్శించారు. డీఈవో భోజన్నతో కలిసి పనులను పర్యవేక్షిస్తూ, మార్కుల నమోదులో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులకు తాగునీరు, కనీస వసతులు కల్పించాలని ఆదేశించారు.
ASF: బెజ్జూర్ మండల పశువైద్యాధికారిగా ఎం.లక్ష్మీనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలలుగా ఇక్కడ వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో పశువులకు వైద్య సేవలు అందక రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో జిల్లా పశువైద్యాధికారి ఆదేశాల మేరకు పొరుగుసేవల కింద లక్ష్మీనారాయణను నియమించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనకు సిబ్బంది, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో యువత భారత సైన్యంలో చేరడానికి మరో 10 రోజులు దరఖాస్తు గడువు పొడిగించామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మొదటగా దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఒకటి వరకు ఉండగా, అభ్యర్థులకు మరింత అవకాశం కల్పించేందుకు ఈనెల 11వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు చెప్పారు.
సూర్యాపేట మున్సిపాలిటీలోని 27వ వార్డులో గురువారం ‘ఆరోగ్యలక్ష్మి’ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో అంగన్వాడీ సేవలు కీలకమని ఆమె పేర్కొన్నారు.