• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఈనెల 28న ఎంప్లాయిమెంట్ కార్డు రిజిస్ట్రేషన్ మేళా

JGL: జగిత్యాలలో ఈ నెల 28న ఎంప్లాయ్మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. జిల్లాలోని 14 – 54 సంవత్సరాల వయస్సు వారు ఈ మేళాలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఉదయం 10:30 -మధ్యాహ్నం 1:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

February 26, 2026 / 05:30 PM IST

రంజాన్ కానుకలు అందిస్తాం: ఎమ్మెల్యే

MDCL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని గౌతమ్‌నగర్ డివిజన్‌లోని అర్హులైన ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ముస్లిం పెద్దలు చేసిన వినతికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

February 26, 2026 / 05:28 PM IST

‘రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం’

KMM: కారేపల్లిలో రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం జరిగింది. రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై గోపి వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

February 26, 2026 / 05:27 PM IST

గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: మంత్రి

MLG: గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం గ్రామాల నూతన సర్పంచుల శిక్షణ కార్యక్రమానికి సీతక్క హాజరై సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. సర్పంచులు నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరు సంపాదించుకోవాలని సీతక్క సూచించారు.

February 26, 2026 / 05:27 PM IST

రెండవ రోజు 147 మంది విద్యార్థులు గైర్హాజరు: DIEO

WGL: ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా నిర్వహించినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. రెండో రోజు పరీక్షలో జనరల్ మొత్తం 4821 విద్యార్థులకు గాను 4705 హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ మొత్తం 744 విద్యార్థులకు గాను 713 మంది హాజరు కాగా 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలను DIEO శ్రీధర్ సుమన్ సందర్శించారు.

February 26, 2026 / 05:25 PM IST

జిల్లాలో ఉచిత క్యాన్సర్ వ్యాధి శిబిరం

వనపర్తి జిల్లాలో శ్రీ సత్య సాయి సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ కో-ఆర్డినేటర్ సీఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వ్యాధి క్యాంపు నిర్వహించారు. శ్రీ సత్య సాయి సేవ సంస్థ జిల్లా అధ్యక్షులు నరహరి పుల్లయ్య హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్క పేషెంట్‌కు దాదాపు రూ.7,000 టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు .

February 26, 2026 / 05:23 PM IST

జాతీయ స్థాయి శిబిరంలో తరుణ్ ప్రతిభ

NLG: కేరళలోని కుట్టిక్కానంలో జరిగిన జాతీయ సమగ్రత శిబిరం(NIC)లో NSS వాలంటీర్ కె.తరుణ్ ప్రతిభచాటారు. ఈ నెల 17 నుంచి 23 వరకు మహాత్మా గాంధీ వర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో తెలంగాణ ప్రతినిధిగా తరుణ్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.

February 26, 2026 / 05:22 PM IST

భద్రాచలం తలంబ్రాలు ఇంటికే: RTC

GDWL: భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలను ప్రారంభించింది. గద్వాల డిపోలో డీఎం సునీత, లాజిస్టిక్స్ ఏటీఎం బద్రి నారాయణ పోస్టర్లు విడుదల చేశారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పృథ్వీరాజ్ (9154298609)ను సంప్రదించి ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచించారు.

February 26, 2026 / 05:18 PM IST

VOA భవన నిర్మాణానికి భూమి పూజ

JN: రఘునాథపల్లి గ్రామంలో VOA భవన నిర్మాణానికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భూమి పూజ చేశారు. సర్పంచ్ వెంకటయ్య మాట్లాడుతూ.. గ్రామంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని అన్నారు. ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

February 26, 2026 / 05:18 PM IST

నూతన తరగతి గదుల ప్రారంభించిన మాజీ మేయర్

RR: మహేశ్వరం నియోజకవర్గం, జీహెచ్ఎంసీ పరిధిలోని బడంగ్ పేట్ డివిజన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ హై స్కూల్‌లో నూతనంగా నిర్మించిన తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్ పెద్దబావి సుదర్శన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

February 26, 2026 / 05:17 PM IST

‘సీఎం-కప్’ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు విజయం

WNP: క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘సీఎం-కప్’ 2వ ఎడిషన్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రాష్ట్రస్థాయిలో విజయం సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు.

February 26, 2026 / 05:16 PM IST

6,000 మందికి అన్న ప్రసాద వితరణ

NLG: శ్రీ శ్రీ శ్రీ భూసమేత తిరుమలనాధస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు గురువారం పున్న రాములు భారతమ్మ దంపతులు అన్న ప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమానికి ముందు స్వామివారికి ‘నైవేద్యం’ సమర్పించారు. కళ్యాణానికి విచ్చేసిన దాదాపు 6,000 మంది భక్తులకు ఎలాంటి లోటు లేకుండా అన్న ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. నిర్వహకులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.

February 26, 2026 / 05:15 PM IST

ఓపెన్ జిమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: వివేకానంద నగర్ డివిజన్ AS రాజు నగర్ కాలనీలో రూ.19 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిన్నారుల ఆట స్థలాన్ని ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు ఆస్తుల కంటే మంచి ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని అందించడమే మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలిలో వ్యాయామం అనివార్యమని గాంధీ తెలిపారు.

February 26, 2026 / 05:13 PM IST

పరకాల మార్కెట్ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్

HNK: పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశాన్ని నేడు నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ మార్కెట్ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ మార్కెట్‌కు విచ్చేసే రైతులకు ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేద్దామని అన్నారు. అనంతరం నూతన పరకాల మున్సిపల్ ఛైర్మన్ సునీల్ కుమార్ ను మార్కెట్ పాలకవర్గ సభ్యులు సన్మానించారు.

February 26, 2026 / 05:12 PM IST

ప్రజల రక్షణే నారీ శక్తి ప్రధాన లక్ష్యం: SP

NRML: మహిళల భద్రత ప్రజల రక్షణే నారిశక్తి ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లాలో ప్రతి గురువారం నిర్వహిస్తున్న నారీ శక్తి కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని వెల్లడించారు. మహిళా పోలీస్ సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వచ్చిన డయల్ 100 కాల్‌ను తక్షణమే స్పందించి బాధితుల సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.

February 26, 2026 / 05:10 PM IST