ASF: కాగజ్ నగర్ మండలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గి వాతావరణం చల్లబడింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్రకారం ఇక్కడ గరిష్టంగా 35.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇటీవల కురిసిన స్వల్ప వర్షాల ప్రభావంతో ఎండ తీవ్రత తగ్గిందని , రాబోయే రోజుల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
KMM: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై యధాస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తాహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్ధిదారులను గుర్తించి, ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. బాధితులు హైకోర్టును ఆశ్రయించగా బుధవారం ఈ ఆదేశాలు వెలువడ్డాయి.
JGL: కోరుట్ల పట్టణానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడైన భర్తను కోరుట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మిట్‌లో మెట్‌పల్లి డీఎస్పీ రాములు మాట్లాడుతూ.. మాధాపూర్ గ్రామానికి చెందిన గంధం దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన కుమార్తె చిత్తారి, గంధం వైష్ణవి (20)ను ఆమె భర్త చిత్తారి హరిబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
BHNG: తుర్కపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవతరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ అనురాగ్ జయంతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, గైర్హాజరు వివరాలను సంబంధిత పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటిండెంట్లను అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులను ప్రధాన గేట్ వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేయాలన్నారు
SRCL: ముస్తాబాద్ మండలంలోని మొర్రాపూర్ గ్రామంలో సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని ట్రాక్టర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పాఠశాల నుంచి ఇంటికి వచ్చి సైకిల్‌పై వెళ్తున్న భూక్యా ఇషాన్ అనే బాలుడిని కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇషాన్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
SRPT: తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బుధవారం సూర్యాపేటలో నిర్వహించిన మల్లు స్వరాజ్యం వర్ధంతి సభలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. తుపాకీ పట్టి నిజాంను గడగడలాడించిన వీరవనిత మల్లు స్వరాజ్యం అన్నారు.
NLG: నల్గొండ మున్సిపల్ అధికారుల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపారు. ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించాలని ఫోన్లు చేస్తూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల ఓ ఆసుపత్రికి ఇలాగే ఫోన్ రాగా, యాజమాన్యం అధికారులను సంప్రదించడంతో ఈ మోసం బయటపడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు లింకులు, స్కానర్ల ద్వారా డబ్బులు చెల్లించవద్దని ప్రజలకు సూచన చేశారు.
WGL: రాష్ట్ర బడ్జెట్‌లో ఓరుగల్లుకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రాధాన్యతను ఇవ్వాలని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శివనగర్‌లో వరంగల్ CPI జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో వరంగల్ అభివృద్ధికి ఆమడ దూరంగా నిలిచిపోయిందని, బడ్జెట్‌లో ఓరుగల్లుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు.
HNK: హన్మకొండ DMHO కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న కే.వేణుగోపాల్‌కి పదోన్నతి లభించింది. ఈ క్రమంలో ఆయన MHBD జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా బదిలీ అయ్యారు. బుధవారం ఆయనకు అధికారులు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. DMHO డా.అప్పయ్య, వైద్యసిబ్బంది కార్యక్రమంలో పాల్గొని వేణుగోపాల్‌ను శాలువాతో సత్కరించి, అభినందించారు.
KMR: ప్రతిరోజు వందలాది మంది రాకపోకలతో నిత్యం కళకళలాడే KMR మున్సిపల్ కార్యాలయం జనాలు లేక బోసిపోయింది. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడుల తర్వాత బుధవారం ఒక్కసారిగా జన సంచారం తగ్గడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో పలు రకాల పనుల నిమిత్తం వందలాదిగా వచ్చే జనాలు ఒక్కసారిగా తగ్గడానికి కారణాలు ఏమై ఉంటాయన్న చర్చ సాగుతోంది.
JN: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ బచ్చన్నపేట మండలంలోని హోటళ్లు, దాబాలపై సివిల్ సప్లై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గృహ వినియోగ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించి, పలు సిలిండర్లను సీజ్ చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. హోటళ్లలో కేవలం 3 కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలన్నారు.
KMM: ముదిగొండ మండలంలొ పదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) పరీక్ష బుధవారం ప్రశాంతంగా ముగిసిందని ఎంఈవో రమణయ్య తెలిపారు. మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 5 పరీక్షా కేంద్రాలలో మొత్తం 516 మంది విద్యార్థులకు గాను 515 మంది హాజరయ్యారు. ఒక విద్యార్థి గైర్హాజరైనట్లు,విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ బుధవారం దాదాపు 100 మంది ముస్లిం సోదరులకు రంజన్ కిట్లును పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆరు రకాల వస్తువులతో పాటు బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు.
BHNG: మోటకొండూర్ మండల కేంద్రంలో పోలీస్ బృందం ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ పక్కన బుధవారం చలివేంద్ర కేంద్రాన్ని ఎస్సై డీ.అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికులకు పట్టణ ప్రజలకు ఈ యొక్క కేంద్రం చాలా ఉపయోగపడుతుందని, వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమం పోలీసు బృందం తదితరులు పాల్గొన్నారు.
WNP: పదో తరగతి ఉత్తీర్ణత అనంతరం తక్కువ వ్యవస్థలో స్థిర ఉపాధి కోరుకునే వారికి హ్యాండ్లూమ్, టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సుల ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. హైదరాబాదులోని కొండ లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఏప్రిల్ 2026 మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు.