• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కేజీబీవీలో ‘ప్యానల్’ బృందం తనిఖీ

JGL: విద్యార్థుల మేధస్సుకు అనుగుణంగా విద్యాబోధన చేయాలని తనిఖీ బృందం సభ్యులు సూచించారు. సోమవారం పెగడపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీని ప్యానల్ బృందం సందర్శించింది.తరగతి గదులకు వెళ్లి బోధన తీరును, విద్యార్థుల మార్కుల జాబితాలను పరిశీలించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీలో హెచ్ఎం, ఎస్ఓ, తనిఖీ బృందం సభ్యులు,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:50 PM IST

కామ దహనంలో ఎమ్మెల్యే ధన్పాల్

NZB: నగరంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కామ దహనంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:49 PM IST

‘సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి’

ASF: సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోళీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో, ఇతరులకు హాని కలిగించకుండా సూచించారు. ప్రధాన కూడళ్లలో నిరంతర నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 2, 2026 / 07:48 PM IST

జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన.. కలెక్టర్

HNK: హన్మకొండ జిల్లాలోని ప్రజలందరికీ సోమవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. చెడు పై ప్రతీకగా హోలీ పండగ జరుపుకుంటారన్నారు. సహజసిద్ధ రంగులనే వినియోగించాలని, రసాయన రంగులు ఆరోగ్యానికి హానికరమని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని కలెక్టర్ సూచించారు.

March 2, 2026 / 07:42 PM IST

AIMIM ఆధ్వర్యంలో ఘనంగా దావత్-ఎ-ఇఫ్తార్ విందు

HYD: AIMIM ఆధ్వర్యంలో సోమవారం మలక్‌పేట నియోజకవర్గంలోని అజాంపురాలోని ఫరత్ నగర్ గ్రౌండ్ వద్ద దావత్-ఎ-ఇఫ్తార్‌ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, MLC మీర్జా రియాజ్ ఉల్ హసన్ పాల్గొన్నారు. మత పెద్దలతో కలిసి వారు (దువా) ప్రత్యేేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించారు.

March 2, 2026 / 07:40 PM IST

మహిళా సమస్య భవనానికి శంకుస్థాపన

MDK: కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలో వివో 1, 2 మహిళా సమైక్య భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి ఎన్నికల హామీలలో ఆమె మేరకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చందాపురం మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ అంకమ్మ నరసింహులు, సీసీ వెంకటేశం, వీవోలు, ఓబి అధ్యక్షులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:39 PM IST

జక్లేర్‌ గ్రామంలో మహిళ మృతి

NRPT: మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలోని చెరువులో 50 ఏళ్ల లాకా సంజమ్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం ఉదయం రైతులు చెరువు కట్టపైంచి రైల్వే స్టేషన్ వైపు పంట పొలాలకు వెళ్తుండగా మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉన్నాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు.

March 2, 2026 / 07:37 PM IST

ముందస్తు హోలీ సంబరాలు

PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే విద్యాభివృద్ధి సాధించాలని ఆయన సూచించారు. నాణ్యమైన ఉచిత విద్య అందించే సర్కారు బడులే మేలని అన్నారు.

March 2, 2026 / 07:37 PM IST

క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి PM ఖేల్ మహోత్సవం

KNR: క్రీడాకారుల ప్రతిభను గుర్తించడానికి, చాటి చెప్పడానికి ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ కార్యక్రమం, ఎంతో దోహదపడుతుందని, కరీంనగర్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో ప్రధానమంత్రి కీడే సంస్థ పోటీలను ఆయన ప్రారంభించారు.కేంద్రంలోని మోదీ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించడానికి కట్టుబడి పనిచేస్తుందని అన్నారు.

March 2, 2026 / 07:36 PM IST

కాంగ్రెస్ పని ఖతం: కేంద్ర మంత్రి

KMR: అమెరికతో ట్రేడ్ డీల్ చేసుకుంటే ఏ దేశంతో భారత్‌కు యుద్ధం వస్తుందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కామారెడ్డిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పిచ్చికూతలు కూస్తున్న రాహుల్ గాంధీ, ప్రజలు కాంగ్రెస్‌తో యుద్ధం చేస్తున్న విషయాన్ని మరిచిపోయారన్నారు. కరీంనగర్లో సైతం కాంగ్రెస్‌ను ఖతం చేసి మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశారు.

March 2, 2026 / 07:36 PM IST

ఉమ్మడి జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు.. మంత్రి

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు రాష్ట్ర మంత్రి కొండా సురేఖ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ శాంతియుతంగా ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని సూచించారు. రసాయన రంగులు వాడొద్దని అవి ఆరోగ్యానికి హానికరమని మంత్రి హెచ్చరించారు. శాంతి భద్రతలు కాపాడుతూ హోలీని ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

March 2, 2026 / 07:36 PM IST

‘మాదిగలకు రాజ్యసభ స్థానం కేటాయించాలి’

HNK: కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానం కేటాయించాలని MSP జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ అన్నారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి సీటును కేటాయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, మాదిగ కులస్తుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, MSP నేతలు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:35 PM IST

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిరసన

నిర్మల్ జామ మస్జీద్‌లో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ దేశంపైన జరిపిన దాడులకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు సోమవారం నిరసన తెలిపారు. ఈదాడిలో ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా ఖామినీయి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తూ ఇస్లామిక్ దేశాలపైన నిరంతరం దాడులు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు.

March 2, 2026 / 07:35 PM IST

సూరమ్మ చెరువు వద్ద పెద్దపులి సంచారం

JGL: కొంత కాలంగా మహారాష్ట్ర నుంచి దారి తప్పి తిరుగుతున్న పెద్దపులి ఈరోజు కలికోట సూరమ్మ చెరువు పరిసరాల ప్రాంత పొలాల్లో తిరుగుతున్నట్లుగా అటవీ శాఖ అధికారులు పులికాలి ముద్రను గుర్తించారు. పొలాల వైపు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లవద్దని, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

March 2, 2026 / 07:34 PM IST

పాఠశాలల్లో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం

MNCL: జన్నారం మండలంలోని తపాలాపూర్ పాఠశాలలో ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం నిర్వహించారు. సోమవారం అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అడవుల సంరక్షణపై అవగాహన నిర్వహించి, పోటీలు నిర్వహించారు. ఈ సందర్భగా FRO సుష్మారావు మాట్లాడుతూ.. అడవిలో అనేక జీవజాతులు నివసిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM దుంపల తిరుపతి, FSO నదీమ ,శంకర్ ఉపాధ్యాయ బృందం చంద్రిక ఉన్నారు.

March 2, 2026 / 07:34 PM IST