KMR: అమెరికతో ట్రేడ్ డీల్ చేసుకుంటే ఏ దేశంతో భారత్కు యుద్ధం వస్తుందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కామారెడ్డిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పిచ్చికూతలు కూస్తున్న రాహుల్ గాంధీ, ప్రజలు కాంగ్రెస్తో యుద్ధం చేస్తున్న విషయాన్ని మరిచిపోయారన్నారు. కరీంనగర్లో సైతం కాంగ్రెస్ను ఖతం చేసి మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుందని ఆయన గుర్తు చేశారు.