• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మక్తల్ బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా రాజశేఖర్

NRPT: మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నరసింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బడ్జెట్ సమావేశం, కో-ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో బి.కొండయ్య నివాసంలో ఈ ఎంపిక జరిగింది. ప్రజా సమస్యలపై పోరాడుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు.

March 29, 2026 / 08:19 PM IST

విద్యుత్ షాక్‌తో వృద్ధురాలు మృతి

SRPT: విద్యుత్ షాక్‌తో వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన చివ్వెంల గుంజలూరులో ఆదివారం జరిగింది. తన ఇంట్లో పని చేసుకుంటున్న క్రమంలో ఐరన్ గ్రిల్ డోర్‌కు విద్యుత్ తీగ తగలడంతో, అది గమనించని సుంకరి అంజమ్మ (75) షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించారు. మనవడు నరేష్ వర్మ ఫిర్యాదు మేరకు ఎస్సై మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 29, 2026 / 08:18 PM IST

బదిలీపై వెళ్తున్న కార్యదర్శికి సన్మానం

WGL: రాయపర్తి మండలం జయరాం తండా కొలనుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పిన్నింటి భరత్ గత రెండు సంవత్సరాలుగా గ్రామంలో విధులు నిర్వహించారు. నెక్కొండ మండలానికి బదిలీపై వెళ్లుతున్న సందర్భంగా ఆదివారం గ్రామస్థులు ఆయన సేవలను గుర్తిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావుడ్యా శిల్ప–నరేష్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

March 29, 2026 / 08:16 PM IST

‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి’

MNCL: జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.

March 29, 2026 / 08:16 PM IST

‘కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలి’

PDPL: జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏప్రిల్ 1న జరిగే కార్మికుల ధర్నాను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ఈ మేరకు ఇవాళ గోదావరిఖని IFTU కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. 4 లేబర్ కోడ్స్‌ను వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.

March 29, 2026 / 08:16 PM IST

జిల్లాలో రెజ్లింగ్ పోటీల ఎంపికలు పూర్తి..!

NZB: మోపాల్ మండలం మంచిప్పలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అండర్ 20 రెజ్లింగ్ పోటీల ఎంపికలు పూర్తి అయ్యాయి. KMR చెందిన విద్యార్థులు మణికంఠ, లక్ష్మణ్, NZBకు చెందిన యోగేశ్, జగదీశ్, కృష్ణ, సోనియా, సఫియా, ప్రీతి రాజ్ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికయ్యారని వ్యాయామ ఉపాధ్యాయుడు దేవేందర్ తెలిపారు.

March 29, 2026 / 08:14 PM IST

ఇందిరమ్మ ఇళ్లు, నర్సరీలను పరిశీలించిన అదనపు కలెక్టర్

MBNR: గండీడ్ మండలం జానంపల్లి, ఆసిరెడ్డిపల్లి గ్రామాల్లో ఆదివారం అదనపు కలెక్టర్ పర్యటించారు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నర్సరీల్లో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వాడి మొక్కలను వేగంగా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

March 29, 2026 / 08:14 PM IST

శెనగ కొనుగోళ్ల షెడ్యూల్ విడుదల

KMR: మద్నూర్ మండల మార్కెట్ యార్డ్‌లో సింగిల్ విండో ఆధ్వర్యంలో శెనగ పంట కొనుగోళ్ల వివరాలు గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకటించినట్లు మద్నూర్ గ్రామ ఏఈవో సౌమ్య ఆదివారం తెలిపారు. శెనగ కొనుగోళ్లు ఈనెల 30 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని ఆమె తెలిపారు. రైతులు తమ పంటను తీసుకువచ్చి మద్దతు ధరతో కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని ఏఈవో తెలిపారు.

March 29, 2026 / 08:13 PM IST

మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమీక్ష

KNR: జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. అసెంబ్లీ కమిటీ హాలులో అధికారులతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్ నిధులు, ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

March 29, 2026 / 08:13 PM IST

వడదెబ్బతో వృద్ధురాలు మృతి

NLG: పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రానికి చెందిన చేపూరి రంగమ్మ (62) అనే వృద్ధురాలు ఆదివారం వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. శనివారం నుంచి అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. గత వారం రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

March 29, 2026 / 08:12 PM IST

మల్కాజ్‌గిరి కమిషనరేట్లో 118 మంది అరెస్ట్

HYD: మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్‌లో 118 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. వాహనాల వారీగా చూస్తే.. టూ వీలర్లు 96, త్రీ వీలర్ వాహనాలు 4, ఫోర్ వీలర్లు 18 ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడపవద్దని మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.

March 29, 2026 / 08:11 PM IST

కుంగ్ ఫు విద్యార్థుల ఆత్మరక్షణకు దోహదపడుతుంది

SRCL: కుంగ్ ఫూ విద్యార్థుల ఆత్మ రక్షణకు దోహద పడుతుందని అల్ ఇండియా చీఫ్ ఎగ్జామినార్, లెజెండరి గ్రాండ్ మాస్టర్ వీరాచారి అన్నారు. వేములవాడ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో విద్యార్థులకు జరిగిన బెల్టుల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టేందుకు కరాటే శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.

March 29, 2026 / 08:08 PM IST

మార్కెట్ యార్డులో మృతదేహం కలకలం

WNP: పట్టణంలోని మార్కెట్ యార్డు పరిసర ప్రాంతంలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రస్తుతం మృతుడి వివరాలు తెలియరాలేదు. వయస్సు, దుస్తులు ఇతర లక్షణాల ఆధారంగా గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

March 29, 2026 / 08:07 PM IST

కరాటేలో 33 మందికి బ్లాక్ బెల్టులు

ADB: జిల్లా కేంద్రంలో నిర్వహించిన కరాటే గ్రేడింగ్ టెస్ట్ ఉత్సాహంగా సాగింది. బోధి బుడోకాన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముకేశ్ చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన వారికి బెల్టులు పంపిణీ చేశారు. ఠాకూర్ రాము, దేవిదాస్లకు 5వ డాన్ బ్లాక్ బెల్ట్ దక్కగా.. సునీత, రాహుల్‌కు 3వ డాన్ బెల్టులు లభించాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు క్రీడాకారులను అభినందించారు.

March 29, 2026 / 08:07 PM IST

నారేగూడలో భక్తిశ్రద్ధలతో ‘భీమ్ దీక్షలు’!

VKB: నవాబుపేట్ మండలం నారేగూడలో భీమ్ దీక్షలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం 15వ రోజు దీక్షలో భాగంగా దీక్షాపరులు డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ విగ్రహానికి నిత్యమాల అలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించారు. బాబాసాహెబ్ ఆశయ సాధనే లక్ష్యంగా ప్రతిరోజూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జై భీమ్ హోరెత్తించారు.

March 29, 2026 / 08:03 PM IST