• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం: చిన్నారెడ్డి

WNP: ఆపదలో ఉన్న పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు, వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రజా ప్రభుత్వం ముందుంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 168 మంది లబ్దిదారులకు రూ. 38,99,500 విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 

March 29, 2026 / 12:01 PM IST

మేడారంలో రెచ్చిపోతున్న దొంగలు

MLG: మేడారంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణంలో కిరాణా దుకాణాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. శనివారం అర్ధరాత్రి ఓ దుకాణంలో దొంగలు చొరబడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇటీవల కాలంలో మేడారంలో దొంగతనాలు ఎక్కువ అయ్యాయని వ్యాపారులు వాపోతున్నారు. పోలీసులు దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

March 29, 2026 / 12:01 PM IST

ఆహ్వాన పత్రాలకు ప్రత్యేక పూజలు

BHNG: రాజాపేట మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మండల ప్రఖండ అధ్యక్షులు జ్ఞానేందర్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహక బృందం తెలిపారు. ఆదివారం ఏకాదశి పర్వదినం రోజున శ్రీ రామకృష్ణ సాయి మందిరంలో ఆహ్వాన పత్రాలకు ప్రత్యేక పూజలు జరిగిన అనంతరం కరపత్రాల పంపిణీ చేపట్టారు.

March 29, 2026 / 12:01 PM IST

జామడలో మహిళా అభ్యాసులకు అక్షరాస్యత పరీక్షలు

ADB: నార్నూర్ మండలంలోని జామడ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం మహిళా అభ్యాసుల కోసం FLNAT/NIOS పరీక్షలు నిర్వహించారు. సర్పంచ్ చందు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని పరీక్షలు రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు సర్పంచ్ తెలిపారు.

March 29, 2026 / 12:01 PM IST

దేవరకొండలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

NLG: దేవరకొండలో టీడీపీ 44 ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేసి వేడుకలని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:59 AM IST

రేపు రాములబండలో ఉచిత మెగా వైద్య శిబిరం

NLG: ‘ప్రజా పాలన ప్రగతి నివేదిక’లో భాగంగా నల్లగొండ మండలం రాములబండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం భారీ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉంటారని పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఎండీ. అబ్దుల్ జమీర్ తెలిపారు. గ్రామస్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 29, 2026 / 11:56 AM IST

జిల్లాలో తగ్గని అక్రమ ఇసుక రవాణ

NZB: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న ఏ చర్యలైనా నీరుగారి పోతున్నాయి. వేబిల్లు లైనా, ‘మన ఇసుక వాహనం’ ఆన్ లైన్ బుకింగులైనా పేర్లవైనా ఇసుకను అడ్డగోలుగా తవ్వేందుకు, తవ్విన ఇసుకను రహస్య స్థావరాల్లో డంపింగ్ చేసి రాత్రి వేళల్లో దర్జాగా తరలించేందుకు అక్రమార్కులు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

March 29, 2026 / 11:51 AM IST

ఆరోగ్యానికి వ్యాయామం ఆవశ్యకం: సీఐ

KMM: ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత ఆవశ్యకమని మధిర రూరల్ సీఐ డి. మధు అన్నారు. నేడు పట్టణంలోని ఈ- మాల్ బిల్డింగ్‌లో నూతనంగా మేడికొండ పృథ్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పృద్విజిమ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. యువతకు వివిధ పోటీ పరీక్షల్లో దేహ దారుఢ్యతకు శారీరక సౌష్ట్యానికి వ్యాయామం ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నారు.

March 29, 2026 / 11:48 AM IST

హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

MNCL: చెన్నూర్ గురుకుల పాఠశాల హాస్టల్లో 7వ తరగతి విద్యార్థిని శ్రీహిందు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. 3 రోజుల క్రితం స్నేహితులతో జరిగిన గొడవతో మనస్తాపం చెంది బాలిక పురుగు మందు తాగింది. వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 29, 2026 / 11:40 AM IST

ఆదివారం సైతం యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా

ASF: వాంకిడి మండల కేంద్రంలో ఆదివారం సైతం అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. వాగుల నుంచి ఇసుకను తరలిస్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలం దృష్ట్యా భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, ఇసుక తవ్వకాల వల్ల వాగులు ఎడారిగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టాలన్నారు.

March 29, 2026 / 11:39 AM IST

ఉప్పల్ గణేష్ నగర్‌లో వెలగని వీధిలైట్లు..!

MDCL: ఉప్పల్ గణేష్ నగర్‌లో గత 5 రోజులుగా వీధిలైట్లు వెలగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకటి నెలకొని మహిళలు, వృద్ధులు బయటకు రావడానికి భయపడుతున్నారు. చోరీలు, ప్రమాదాల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధిలైట్లు మరమ్మతు చేసి భద్రత కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

March 29, 2026 / 11:39 AM IST

‘పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి’

SRCL: పేదల పెన్నిధి ముఖ్యమంత్రి సహాయనిధి అని కాంగ్రెస్ ఒకటవ వార్డు అధ్యక్షుడు ఎలుక తిరుపతి అన్నారు. సిరిసిల్ల పరిధిలోని రగుడులో రూ. 67,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులు భీమనపల్లి అంజయ్య, తంశెట్టి ఎల్లవ్వ, బొజ్జ వెంకటేశంకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలా ఉపయోగపడుతుందన్నారు.

March 29, 2026 / 11:36 AM IST

వెల్దండలో నూతన బోరు మోటార్లు ప్రారంభం

NGKL: వెల్దండ మండల కేంద్రంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని ఆదివారం నూతన బోరు మోటర్లను సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. వేసవిలో గ్రామంలో ప్రతి వార్డులో నీటి ఎద్దడిని దృష్టి పెట్టుకుని నూతన బోరు మోటార్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

March 29, 2026 / 11:36 AM IST

’80 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలి’

PDPL: రామగుండం సింగరేణి సంస్థలో కొనసాగుతున్న ప్రైవేట్ కంపెనీలలో స్థానికులకు 80 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని HMS రాష్ట్ర నాయకులు రియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. GDK ప్రెస్ క్లబ్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. ఇక్కడున్న ప్రైవేట్ కంపెనీలు స్థానిక యువతను ఆర్థిక దోపిడీకి గురిచేస్తున్నాయన్నారు.

March 29, 2026 / 11:36 AM IST

‘బసవేశ్వరుడి బోధనలు ఆచరణీయం’

VKB: మహాత్మా బసవేశ్వరుడి బోధనలు ఆచరణీయమని వికారాబాద్ మాజీ సర్పంచ్ న్యాయవాది బస్వరాజ్ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బసవేశ్వర విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన బసవరాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వీరేశం భద్రప్ప దయానంద్ తదితరులు ఉన్నారు. వీరశైవ సమాజం సభ్యులు చెన్నప్ప ఉన్నారు.

March 29, 2026 / 11:35 AM IST