• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలో లోక్ అదాలత్‌లో 6,500 కేసుల పరిష్కారం

KMM: జిల్లా కోర్టుతో పాటు సత్తుపల్లి, మధిర కోర్టుల్లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 6,500 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా న్యాయ సేవాధికారీ M.కల్పన తెలిపారు. ఈ కేసుల్లో సివిల్ కేసులు 2,730, సివిల్ కేసులు 37, చెక్ బౌన్స్ కేసులు 48, కుటుంబ తగాదా కేసులు 10, మోటారు ప్రమాద కేసులు 85, డ్రంకెన్ డ్రైవ్ కేసులు 3,544, లిటిగేషన్ కేసులు 46 ఉన్నాయన్నారు.

March 29, 2026 / 06:10 AM IST

ఆర్టీసీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

PDPL: కేంద్ర ప్రభుత్వ PMKVY 4.0తో పాటు రాష్ట్ర ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా RGM ప్రభుత్వ ITIలో స్వల్పకాలిక శిక్షణ కోర్సులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సురేందర్, శిక్షణాధికారి విద్యాసాగర్ రెడ్డి తెలిపారు. CNC టర్నింగ్, 3D ప్రింటింగ్‌తో పాటు ATC కింద15 రోజుల ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 18 సంవత్సరాలు పూర్తయిన దరఖాస్తు చేసుకోవన్నారు.

March 29, 2026 / 06:08 AM IST

వ్యక్తిపై దాడి.. కేసు నమోదు

వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. పట్టణంలోని జంగాల గుట్టకు చెందిన మండ్ల వెంకటేష్‌పై అతని బామ్మర్ది గుజ్జుల ఎల్లయ్య శుక్రవారం నాగవరం కల్లు దుకాణం వద్ద అకారణంగా గొడవపడి, కల్లు సీసాతో దాడి చేశాడు. ఈ ఘటనలో వెంకటేష్ రక్తగాయమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 29, 2026 / 06:06 AM IST

పలు ఆసుపత్రులను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

BDK: భద్రాచలంలో ఉన్న జాబిల్లి హాస్పిటల్, రాధ హాస్పిటల్లను DMHO డా.తుకారామ్ రాథోడ్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల పనితీరు, అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించిన డీఎంహెచ్‌వో ఆసుపత్రి యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. రోగుల సౌకర్యార్థం సేవల చార్జీలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలన్నారు.

March 29, 2026 / 06:06 AM IST

క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్’లో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఈ క్రీడా వేడుకల్లో మంత్రులు, సహచర శాసనసభ్యులతో కలిసి ఆయన క్రీడాస్ఫూర్తిని చాటారు. ముఖ్యంగా టగ్ ఆఫ్ వార్, కబడ్డీ పోటీల్లో పాల్గొని అందరిని అలరించారు.

March 29, 2026 / 06:03 AM IST

గోవుల అక్రమ రవాణా.. కేసు నమోదు

WGL: వర్ధన్నపేట పట్టణంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏడు ఆవులను వధశాలకు తీసుకెళ్తుండగా బృందం అడ్డుకుని తనిఖీ చేసింది. అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

March 29, 2026 / 06:03 AM IST

విద్యుత్తు సరఫరాలో నేడు అంతరాయం

నల్గొండ పట్టణంలో నేడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు సంస్థ ఏడీఈ వేణుగోపాలచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు, భారత్ గ్యాస్ గోదాం ఏరియాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం నెలకొంటుందని వివరించారు. ఈవిషయం గుర్తించి విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.

March 29, 2026 / 06:02 AM IST

జిల్లాలో CM పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

ADB: బజార్హత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో ఏప్రిల్ 6న నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేయాలని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఆదేశించారు. ఏప్రిల్ 6న ఉదయం 11 గంటలకు CM బాసరకు చేరుకుని పూజలు నిర్వహిస్తారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం 2 గంటలకు పిప్పిరి చేరుకుని సభలో ప్రసంగిస్తారు.

March 29, 2026 / 06:02 AM IST

రేడియం స్టిక్కర్ల విధానంపై లారీ యజమానుల ఆగ్రహం

SRPT: లారీ యజమానులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ పోకడలను నిరసిస్తూ, రాష్ట్ర లారీ ఓనర్ల అసోసియేషన్ కోదాడలో శనివారం నిరసన తెలిపింది. రేడియం స్టిక్కర్ల పేరిట వేల రూపాయలు వసూలు చేయడం అన్యాయమని అసోసియేషన్ ప్రతినిధులు మండిపడ్డారు. ఈ విధానాన్ని వెంటనే నిలిపివేయాలని,లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.

March 29, 2026 / 06:01 AM IST

ఎల్బీ స్టేడియంలో క్రీడా వేడుక.. ఎమ్మెల్యే మదన్ మోహన్ హాజరు

KMR: ఎల్బీ స్టేడియంలో ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2026’ను సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఈ వేడుకలో శనివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ప్రజాప్రతినిధుల్లో ఐక్యత, ఆరోగ్య చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు.

March 29, 2026 / 06:00 AM IST

శ్రీనిధిలో నిజామాబాద్ జిల్లా అగ్రస్థానం

NZB: శ్రీనిధి 2024-25 వార్షిక మహాసభలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మంత్రి సీతక్క చేతుల మీదుగా డీఆర్‌డీవో సాయి గౌడ్ పురస్కారం అందుకున్నారు. రూ.216 కోట్ల లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు రుణాల రికవరీలో జిల్లా అగ్రస్థానం సాధించింది. ఈ వేడుకలో కమ్మర్‌పల్లి మండల సమైక్యకు కూడా అవార్డు అందజేశారు.

March 29, 2026 / 06:00 AM IST

దుర్గమ్మ జాతరకు పోలీసుల బందోబస్తు

MDK: అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామంలో దుర్గమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ రేణుక రెడ్డి, ఎస్సై శంకర్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జాతర ప్రశాంతంగా సాగేలా అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.

March 29, 2026 / 05:46 AM IST

వరంగల్ ఆర్టీసీ ఆర్ఎంగా భవానీ ప్రసాద్

WGL: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉమ్మడి వరంగల్ రీజనల్ మేనేజర్‌గా సోమరాజు భవానీ ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న ఆర్ఎం విజయ భానును ఆదిలాబాద్ జిల్లా ఆర్ఎంగా బదిలీ చేశారు. భవానీ ప్రసాద్ 2013-14లో వరంగల్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్‌గా సమర్థవంతంగా సేవలందించారు.

March 29, 2026 / 05:45 AM IST

విద్యా కార్యక్రమాలపై కలెక్టర్ సమగ్ర సమీక్ష

నారాయణపేట జిల్లాలో అమలవుతున్న వివిధ విద్యా కార్యక్రమాలపై కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సమగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో జరుగుతున్న కార్యక్రమాల అమలు, వాటి ప్రభావం, నాణ్యతా ప్రమాణాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు.

March 29, 2026 / 05:42 AM IST

వాంకిడి మండల కేంద్రంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సరండి రోడ్డు వద్ద SI మహేందర్ శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ద్వి చక్రవాహనాలను ఆపి వారికి బ్రీత్ ఎనైజర్‌తో తనిఖీలు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా, అనుమతి పత్రాలు లైసెన్స్ లేకపోయినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.

March 29, 2026 / 05:37 AM IST