• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆలయ అభివృద్ధికి ముందుకొచ్చిన దాతలు

SRD: మానూర్ మండలం బోరంచ గ్రామ శివారులోని మంజీర నది ఒడ్డున ఉన్న శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో త్వరలో జరగనున్న ఏడు గురువారాలు, ఏడు ఆదివారాలు మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో కూర్చోవడానికి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జుక్కల్ గ్రామానికి చెందిన వీరన్న ఆలయానికి సిమెంట్ బెంచీలను అందించారు.

March 29, 2026 / 06:46 AM IST

కలెక్టర్ సమక్షంలో జిల్లా కమిటీ ఎన్నిక

NGKL: జిల్లాలో ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణకు జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడిగా కోళ్ల శివ ఎన్నికయ్యారు. కలెక్టర్ బి. సంతోష్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహనీయుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు, సభ్యులకు సూచించారు. ఇందులో ఎస్సీ అభివృద్ధి అధికారి ఫిరంగి, ఆర్. పాండు పాల్గొన్నారు.

March 29, 2026 / 06:46 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని కోరారు. చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండటం వల్ల ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చని సూచించారు.

March 29, 2026 / 06:45 AM IST

రాజీమార్గమే రాజ మార్గం: న్యాయవాది

KMM: రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి. రాజగోపాల్ అన్నారు. శనివారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా ప్రిన్సిపల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ నిర్వహించారు.

March 29, 2026 / 06:45 AM IST

NSS వాలంటీర్ల ఇంటింటి సర్వే

NRPT: నారాయణపేటలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన NSS వాలంటీర్లు శనివారం దామరగిద్ద మండలం మద్దెలబీడు గ్రామంలో వేసవి శిబిరంలో భాగంగా ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి జీవన విధానం, వ్యవసాయం, అక్షరాస్యత, కుటుంబంలో ఎంత మంది చదువుకున్నారు అనే విషయాలపై సర్వే చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎండి షఫిక్ అహ్మద్, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

March 29, 2026 / 06:43 AM IST

‘వైద్య శిబిరాల‌ను గ్రామీణులు స‌ద్వినియోగం చేసుకోవాలి’

NLG: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆద్వర్యంలో నిర్వహించే వైద్య శిబిరాలను గ్రామీణ ప్ర‌జ‌లు సద్వినియోగం చేసుకోవాలని న‌ల్ల‌గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం గుర్రంపోడు పీహెచ్‌సీలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

March 29, 2026 / 06:42 AM IST

బండర్పల్లిలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం

MBNR: సీసీ కుంట మండలం బండర్పల్లిలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత రెడ్డి శనివారం ప్రారంభించారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ఎంతోమంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

March 29, 2026 / 06:42 AM IST

‘కేంద్రం నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు’

GDWL: కేంద్రం నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయనే విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించాలని బీజేపీ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. శనివారం అయిజలో మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. దేశంలో ఒకే రాజ్యాంగం ఒకే జెండా ఉండాలని నినదించారు.

March 29, 2026 / 06:40 AM IST

ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షల షెడ్యూల్ విడుదల

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (APE/ PCH) 8, 10వ సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్‌గా థియరీ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ శనివారం తెలిపారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఆయన ఏప్రిల్ 4 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

March 29, 2026 / 06:40 AM IST

సుందరీకరణ సరే.. శుభ్రత ఎన్నడు..?

MDCL: రామంతపూర్ పెద్ద చెరువు బండను రూ. 1.65 కోట్లతో సుందరీకరణ సరే, చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగింపు ఎప్పుడు చేపడతారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం అందంగా మార్చడం కాకుండా, చెరువు శుభ్రతపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. గుర్రపు డెక్క తొలగింపు ఆలస్యం అవుతుండడంతో దుర్వాసన, దోమల సమస్యలు పెరుగుతున్నాయన్నారు.

March 29, 2026 / 06:35 AM IST

‘ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి’

KMM: ఖమ్మం అర్బన్ తహసీల్దార్‌గా డి. జయచందర్, కూసుమంచి తహసీల్దార్‌గా సైదులు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు శనివారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవలు అందజేయాలని వారికి కలెక్టర్ సూచించారు.

March 29, 2026 / 06:30 AM IST

‘తాగునీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలి’

SDPT: వేసవికాలం దృష్టిలో పెట్టుకొని తాగునీటి సరఫరాలో ఇబ్బంది కలగకుండా మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్‌లతో సమావేశం నిర్వహించారు. పట్టణాలు శుభ్రంగా ఉండాలని ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్య క్రమాలు నిర్వహించాలని సూచించారు.

March 29, 2026 / 06:30 AM IST

ఈనెల 30న తైబజార్ వేలంపాట

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని తైబజార్ వేలం పాట కార్యక్రమాన్ని ఈ నెల 30న నిర్వహించనున్నట్లు సర్పంచ్ నిమ్మల శంకర్, GP కార్యదర్శి రాంబాబు తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు రూ.10,000 డిపాజిట్ చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసుకున్నవారికి మాత్రమే వేలం పాట పాడే అవకాశం ఉంటుందని వారు స్పష్టం చేశారు.

March 29, 2026 / 06:28 AM IST

‘బాలల పరిరక్షణ కమిటీ సభ్యుల బోర్డులో ఏర్పాటు’

KNR: మానకొండూర్ మండలం, మానకొండూర్, శ్రీనివాస్ నగర్, జగ్గయ పల్లిలో బాలల పరిరక్షణ కమిటీ సభ్యుల బోర్డులు ఏర్పాటు చేశారు. మిషన్ వాత్సల్య చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కో ఆర్డినేటర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఆపదలో ఉన్న పిల్లల కోసం ఈ కమిటీ ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకుని సమస్యలు ఉన్న పిల్లలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరిస్తామన్నారు.

March 29, 2026 / 06:27 AM IST

రాష్ట్ర స్థాయి పోటీలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే

SRD: పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలో జరిగిన 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి మ్యాట్ కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమవ్వాలని ఆయన పేర్కొన్నారు. పోటీలను పదేళ్లుగా నిర్వహిస్తున్న పండును అభినందించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

March 29, 2026 / 06:24 AM IST