• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి’

BHPL: జిల్లా మేడిపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిశుభ్రత, ఆహార నాణ్యత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదేశించారు. MPDO బాబు ఉన్నారు.

March 26, 2026 / 09:55 AM IST

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని దొడ్డుగుట్ట వద్ద గల శ్రీ అయోధ్య రామాలయంలో రేపు నిర్వహించనున్న 107వ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను గురువారం సర్పంచ్ బొల్లం ఉమారాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాణి, శ్రీసీతారాముల కళ్యాణానికి ప్రజలు హాజరై దీన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు పాశం నిరంజన్, పాశం దయాకర్, రాజేంద్ర ప్రసాద్.

March 26, 2026 / 09:55 AM IST

గురుకులానికి 8 మంది విద్యార్థుల ఎంపిక

MNCL: జన్నారం మండలంలోని ధర్మారం గ్రామ ప్రభుత్వ యుపిఎస్ పాఠశాల నుంచి 8 మంది విద్యార్థులు గురుకుల విద్యాలయానికి ఎంపికయ్యారని హెచ్ఎం సత్తయ్య తెలిపారు. ఇవాళ పాఠశాల ఆవరణలో గురుకులానికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. తమ పాఠశాలకు చెందిన సందీప్, కీర్తన, అవంతిక, తన్మైశ్రీ, హర్శిని, ఆరుష్,అహల్య, శ్రీజన్ కుమార్ ఉన్నారు.

March 26, 2026 / 09:53 AM IST

ఆశా వర్కర్లు భిక్షాటనతో నిరసన

MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని మండల ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. మరిపెడ పట్టణ కేంద్రంలో అంగడి బజార్‌లో నేడు ఆశా వర్కర్లు భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తక్కువ వేతనంతో తమ కుటుంబాలను పోషించడంలో కష్టతరమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్య కోసం క్షేత్రస్థాయిలో నిత్యం వెట్టిచాకిరి చేస్తున్నాము.

March 26, 2026 / 09:52 AM IST

చిల్పూరు మండల కన్వీనర్‌గా హరీష్ గౌడ్

JN: చిల్పూరు మండల BRS పార్టీ కన్వీనర్‌గా రంగు హరీష్ గౌడ్ ను మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నియమించారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, BRS పార్టీ బలోపేతమే ప్రధాన పనిచేస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హరీష్ గౌడ్‌కు రాజయ్య సూచించారు.

March 26, 2026 / 09:51 AM IST

కిసాన్ సంగ్ అసెంబ్లీ నేత అరెస్ట్

VKB: రైతు సమస్యల పరిష్కారానికి గురువారం అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఏఐకేఎంఎస్ నాయకుడు మహేందర్‌ను పోలీసులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందంటూ కిసాన్ సంగ్ అసెంబ్లీ ముట్టడికి నిర్ణయించింది. ఈ మేరకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

March 26, 2026 / 09:47 AM IST

ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాలు

SRD: సంగారెడ్డి మండలం కల్పగూరు, అంగడిపేట, మల్కాపూర్ గ్రామాల్లో ఈ నెల 31వ తేదీ వరకు ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. వారం రోజుల పాటు వాలంటీర్లు గ్రామాల్లో పరిశుభ్రత, సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పారు.

March 26, 2026 / 09:46 AM IST

నూతన SBI బ్రాంచ్ ను ప్రారంభించిన.. కలెక్టర్

BHPL: జిల్లాలోని మంజూరు నగర్‌లో నూతన SBI బ్రాంచ్‌ను ఇవాళ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధిలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణ అత్యంత అవసరమని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు, ఏటీఎం సేవలు వంటి అన్ని రకాల సేవలు ఈ బ్రాంచ్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

March 26, 2026 / 09:45 AM IST

జిల్లాలోని MLS పాయింట్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మార్కెట్ యార్డ్‌లోని మండల స్థాయి నిల్వ (MLS) కేంద్రాన్ని అధికారులతో కలిసి తనిఖీ చేశారు. గిడ్డంగిలోని నిత్యావసరాల నిల్వలు, నాణ్యత, సరఫరా రికార్డులను ఆమె సమీక్షించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్ సక్రమంగా అందేలా చూడాలని, స్టాక్ పంపిణీలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.

March 26, 2026 / 09:45 AM IST

‘ఒకటవ డివిజన్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం’

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని ఒకటవ డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మహబూబ్‌నగర్ మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డితో కలిసి డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

March 26, 2026 / 09:44 AM IST

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ

WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఇవాళ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతుల కారణంగా ప్రజలు పెద్ద సంఖ్యలో బంకుల వద్ద చేరి ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల రద్దీ ఏర్పడి సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతోందని, వదంతులు వ్యాప్తి చేస్తే చర్యలు తీసుకుంటాం.

March 26, 2026 / 09:38 AM IST

భీంపురంలో బోర్ పనులకు శ్రీకారం

NRPT: మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని భీంపురం 11వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ సంజీవ్ ప్రారంభించి, పనులను పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

March 26, 2026 / 09:35 AM IST

‘వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి’

MHBD: మొక్కజొన్న రైతులు మద్దతు ధర లేక భారీ నష్టాలు చవిచూస్తున్నారని కొత్తగూడ మండల బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బానోత్ నెహ్రూ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఒక్క క్వింటాల్‌కు 1600 నుంచి 1800 రూపాయలకు మాత్రమే విక్రయించాల్సి వస్తోందని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు.

March 26, 2026 / 09:35 AM IST

సరూర్ నగర్ PSలో అరెస్ట్ అయిన జాదవ్ సోమేశ్

ADB: ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాదవ్ సోమేశ్ ఇవాళ హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో అరెస్టయ్యారు. ఈ సందర్బంగా ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో అక్కడి పోలీసులు ఆయన్ను ముందస్తు అరెస్ట్ చేశారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసినా నిరుద్యోగుల తరఫునే పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.

March 26, 2026 / 09:34 AM IST

నియంత్రణ కోల్పోయి లారీ బోల్తా

MNCL: మందమర్రి మున్సిపాలిటీ పరిధి నార్లపూర్ జాతీయ రహదారిపై ఇవాళ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. మంచిర్యాల వైపు వెల్లుల్లి లోడ్‌తో వెళ్తున్న లారీ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెల్లుల్లి బస్తాలు చెల్లాచెదురుగా పడటంతో రాకపోకలకు కొంత అంతరాయం కలిగింది.

March 26, 2026 / 09:32 AM IST