• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం అందజేత

SRD: ప్రతి ఒక్కరికి దైవచింతన ఉండాలని బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. జిన్నారం మున్సిపల్ తాబేలు గుట్టలో నూతన శ్రీ జీవన జ్యోతిర్లింగ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో గుమ్మడిదల బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధికి రూ.1,51,000 విరాళం అందజేశారు. దైవానుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు.

February 22, 2026 / 06:32 PM IST

ధర్మారంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

PDPL: అనివార్య కారణాల వల్ల చదువు మధ్యలో మానేసిన వారికి ఆదివారం ధర్మారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ బేస్ లైన్ పరీక్షలు నిర్వహించినట్లు కోఆర్డినేటర్ వడ్లూరి కిరణ్ తెలిపారు. చివరి పరీక్షలు ఏప్రిల్లో పెద్దపల్లిలో నిర్వహించబడతాయని ఆయన పేర్కొన్నారు. అందుకోసం విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

February 22, 2026 / 06:31 PM IST

నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలి: ఎమ్మెల్యే

BDK: నిర్మాణంలో నాణ్యత పాటించాలని, గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే పాయం ఆదేశించారు. పినపాక మండలంలోని పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. సుమారు రూ. 65 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.

February 22, 2026 / 06:30 PM IST

కోటగుళ్లు శిల్ప సంపద అద్భుతం: ఇంగ్లాండ్ దేశస్థులు

MHBD: కోటగుళ్ళు శిల్ప సంపద అద్భుతమని ఇంగ్లాండ్ దేశానికి చెందిన సిమన్, వాలేరీలు అన్నారు. ఆదివారం ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను చరిత్రను రామప్ప గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వారికి వివరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ఫోటోలు, వీడియలు తీసుకున్నారు.

February 22, 2026 / 06:29 PM IST

రేపు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

BDK: కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేపు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని క్యాంప్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటించారు. కొత్తగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని అందజేస్తారని అన్నారు. అందరూ సకాలంలో హాజరు కావాలన్నారు.

February 22, 2026 / 06:27 PM IST

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో పలువురు చేరికలు

HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 61 డివిజన్ చైతన్యపురి కాలనీలో తెలంగాణ రాజ్య అధికార పార్టీ లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం చేరారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న విధానాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్న వ్యక్తులకు నగరాధ్యక్షుడు అయినవోలు మల్లికార్జున శాస్త్రి కండువాలు కప్పి ఆహ్వానించారు.

February 22, 2026 / 06:27 PM IST

కొంతమంది కావాలని ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు: మంత్రి

MLG: కొంతమంది కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. ఈరోజు కన్నయ్యగూడెం మండల కేంద్రంలోని దేవాదుల ప్రాజెక్టు వద్ద నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది డిసెంబర్ నెలలోపు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందుబాటులో ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చారు.

February 22, 2026 / 06:25 PM IST

సంత్ రవిదాస్ విగ్రహావిష్కరణ.!

RR: హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో సంత్ శిరోమణి గురు రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మోచి సంఘం ఏర్పాటు చేసిన గురు రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక నాయకులు బోయిని మహేష్ యాదవ్, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, రవిదాస్‌కు నివాళులర్పించారు.

February 22, 2026 / 06:25 PM IST

కాసరబాదలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

SRPT: కాసరబాదలో జరిగిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. పేదల సొంతింటి కల కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా వంచించిందని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం పేదలకు గృహవసతి కల్పిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని పేర్కొన్నారు.

February 22, 2026 / 06:21 PM IST

క్షేత్రస్థాయిలో పనులు పర్యవేక్షించాలి: మంత్రి

KMM: కేవలం నిధులు ఉంటే సరిపోదని, పనుల నాణ్యతను ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు ప్రతిరోజూ తమ వార్డుల్లో 2 గంటల పాటు పర్యటిస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని మంత్రి శ్రీనివాసరెడ్డి నేడు పేర్కొన్నారు. ఎదులాపురంలో నూతన వార్డు సభ్యుల సన్మాన సభలో ఆయన మాట్లాడారు.

February 22, 2026 / 06:21 PM IST

శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో ఎమ్మెల్యే వేముల

NZB: వేల్పూర్ మండలంలోని కుకునూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర స్వామి జాతరలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

February 22, 2026 / 06:20 PM IST

తాటిపాములలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

WNP: శ్రీ రంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఆదివారం వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి భూమి పూజ చేశారు.గ్రామ దేవతలను పూజించడం గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలు నిర్మించడం ఎంతో శుభసూచకమని అన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

February 22, 2026 / 06:19 PM IST

తైక్వాండలో విద్యార్థులకు బెల్టుల ప్రధానం

NLG:నార్కట్‌పల్లిలోని పీవీఆర్ చేతన పాఠశాలలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విద్యార్థులకు బెల్టులు అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ విమల మాట్లాడుతూ.. క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుందన్నారు. ఎగ్జామినర్ సుధాకర్ ఆధ్వర్యంలో మొత్తం 65 మంది విద్యార్థులు బెల్టులు సాధించారు.

February 22, 2026 / 06:19 PM IST

జమ్మికుంటలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం

KNR: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో గుప్తనిధుల కోసం జరిగిన తవ్వకాలు స్థానికంగా కలకలం రేపాయి. మహబూబ్ అలీ అనే వ్యక్తికి చెందిన పట్టా భూమిలో శనివారం అర్ధరాత్రి కొందరు అక్రమంగా తవ్వకాలు చేపట్టారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన కోయ, ముస్లిం పూజారులతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు సమాచారం.

February 22, 2026 / 06:16 PM IST

హన్వాడలో రోడ్డు భద్రత అవగాహన

MBNR: హన్వాడ మండల కేంద్రంలో ఆదివారం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించి ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.

February 22, 2026 / 06:16 PM IST