RR: హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో సంత్ శిరోమణి గురు రవిదాస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మోచి సంఘం ఏర్పాటు చేసిన గురు రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక నాయకులు బోయిని మహేష్ యాదవ్, పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, రవిదాస్కు నివాళులర్పించారు.