ADB: గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ (ఎస్సీ) కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పాఠశాల నుంచి పరీక్షకు హాజరైన నలుగురు విద్యార్థులు బోథ్ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించి వంద శాతం ఫలితాన్ని నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించడంపై హర్షం వ్యక్తమవుతోంది.
MHBD: సీరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మోద్గులగూడెం గ్రామంలో ఈరోజు గ్రామసభ నిర్వహించారు. ఎస్సై సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఎస్పీ డా. శబరీష్ సూచించినట్లు గ్రామంలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తామని, గంజాయిని తమ గ్రామం గడప తాకనీయమని, హెల్మెట్ వాడకం తప్పనిసరి చేస్తామంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో జాతీయ రహదారి 44పై గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న లారీ, దండుపల్లి చౌరస్తా వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో బాలాజీనగర్ కాలనీలోని ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతాలను కార్పొరేటర్ రమేష్ బాబు పరిశుభ్రం చేస్తున్నారు. శనివారం శ్రీరామనమి వేడుకల్లో భాగంగా ఆలయం పరిసరాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇబ్బందికరంగా ఉన్న పరిసరాలను జేసీబీ సహాయంతో శుభ్రం చేశారు.
MDCL: కుత్బుల్లాపూర్‌లోని పేట్ బషీరాబాద్ PS పరిధిలో పల్లవి లహరి(19) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సందీప్‌తో ప్రేమలో ఉన్న ఆమె, మార్చి 24 జరిగిన గొడవ తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుంది. సందీప్ తిరిగి వచ్చి చూడగా, అప్పటికే ఆమె మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో సందీప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
BDK: పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద గుంతలు పడ్డ రోడ్లకు అధికారులు ఇటీవల మరమ్మతులు చేపట్టారు. శ్రీరామనవమి దృశ్య తత్కాలిక చర్యలలో భాగంగా పూడ్చిన గుంటలు, మరల ఒక్క రోజు తిరగకుండానే రోడ్డు మొత్తం కాంకర్ రాళ్ల తో నిండిపోయింది. బైక్ మీద వెళ్లే వాళ్ళు జారి కింద పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. తిరిగి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
PDPL: రామగుండం మున్సిపల్ సమావేశం సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, ఇంఛార్జి కమిషనర్ అరుణ శ్రీకి 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామని బుధవారం వినతిపత్రం ఇచ్చారు. జనగామలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంటర్ లైటింగ్, మహిళా భవనం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాలకు ఉచిత విద్యుత్ కల్పించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మేకల సమ్మన్న, జనగామ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
JN: లింగాలఘణపురం (M) చిటూర్‌లో గత ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ మెట్ల సైడ్ వీల్ ఇరిగి వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ ట్యాంక్ అత్యంత దగ్గరలో చిన్నపిల్లల అంగన్వాడీ కేంద్రం ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్యాంక్ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు.
KMM: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు గురువారం తెలిపారు. ఈనెల 27 శ్రీరామనవమి, 28 శనివారం, 29 ఆదివారం వారాంతపు సెలవు కావడంతో తిరిగి 30 వ తారీకున మార్కెట్ క్రయవిక్రయాలు యధావిధిగా జరుగుతాయని వెల్లడించారు. రైతు సోదరులు గమనించారని కోరారు.
ADB: యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఏఎస్సై కాళ్లే రమేశ్ పిలుపునిచ్చారు. సిరికొండ పోలీస్ స్టేషన్‌లో పాలవాగు గ్రామానికి చెందిన యువకులకు ఆయన వాలీబాల్ కిట్‌ను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యువకులు యాదవ్ రావ్, భీంరావ్, తదితరులు పాల్గొన్నారు.
BDK: భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం, తెలంగాణలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక ప్రఖ్యాత ఆలయ పట్టణం. ఇది ధనుస్సు, బాణం, శంఖం, చక్రం ధరించిన స్వయంభూ శ్రీరామునికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి, దానిని నిర్మించిన భక్త రామదాసుతో గాఢమైన సంబంధం ఉంది. అలాగే ఈ క్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రంగా పేరు ఉంది.
WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సురేష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం సహా ఇతర ఆరోపణల నేపథ్యంలో జరిగిన విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో అధికారులు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ నిన్న రాత్రి సురేష్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
KNR: ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చింది. రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులందరూ తప్పనిసరిగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తిగా లేదా అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం తెచ్చిన SC వర్గీకరణ నేపథ్యంలో సరిదిద్దుకోవడానికి APR 10 వరకు పొడిగించినట్లు వెల్లడించిది.
VKB: గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మున్సిపల్ ఛైర్మన్ ఎన్. ప్రశాంత్ అన్నారు. కొడంగల్ మండలం సంగాయిపల్లిలో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ హన్మయ్య, నాయకులతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ అంజి, వార్డు సభ్యులు ఉన్నారు.
SRD : బొల్లారం డివిజన్ కార్యాలయం ముందు ITC కంపెనీ CSR నిధులతో 8 ఎలక్ట్రిక్ ఆటోలు, 15 కంప్యూటర్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. డిప్యూటీ కమిషనర్ అమీన్‌పూర్ సర్కిల్ ప్రదీప్ కుమార్‌కు ఆటోలు, ప్రభుత్వ విద్యాసంస్థలకు కంప్యూటర్లు అందజేశారు. అభివృద్ధి, విద్యకు తోడ్పాటు అందించడమే లక్ష్యమని తెలిపారు.