RR: నల్లగండ్ల హుడా కాలనీలో రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను MLA అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. అత్యాధునిక వీధి దీపాల వల్ల కాలనీకి కొత్త శోభ రావడమే కాకుండా, రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారుల ప్రయాణం సురక్షితంగా మారుతుందని తెలిపారు.
SRCL: వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో బుధవారం స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. గత 8 నెలల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, ఆలయానికి మొత్తం రూ.6,07,481 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
వనపర్తి మండలం పెద్దగూడెం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 11:30 గంటలకు సుముహూర్తంలో శ్రీరాముడు సీతమ్మ మెడలో మంగళసూత్రం ధరించగా అర్చకుడు రమణయ్య పెళ్లి క్రతువును నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించగా, ఇక్కడ సీతారాముల కళ్యాణం సప్తమి రోజున నిర్వహించడం సంప్రదాయమని స్థానికులు తెలిపారు.
KNR: జమ్మికుంట పట్టణంలోని మేధారు వాడా ప్రాంతంలో ఉన్న 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను 160 కేవీఏకు విద్యుత్ అధికారులు అప్ గ్రేడ్ చేశారు. వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతర సరఫరా కోసం ఈ చర్య చేపట్టారని అధికారులు తెలిపారు. ఏఈ జమ్మికుంట, వార్డ్ కౌన్సిలర్ చింతల శ్రీనివాస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.
HYD: శ్రీరామ నవమి సందర్భంగా రేపు హైదరాబాద్ ‘కాషాయ’మయం కానుంది. సీతారాంబాగ్, ఆకాశపురి నుంచి హనుమాన్ టేక్డ్ వరకు భారీ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఒకవైపు ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు, మరోవైపు ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10వ సెమిస్టర్ విద్యార్థులు ఈనెల 28 వరకు పరీక్షా ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. కే.సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించడానికి మరో మూడు రోజులే సమయం ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
PDPL: జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు ఈనెల 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. గైనకాలజీ, రేడియాలజీ, ఆప్తమాలజిస్టు, ఆర్థోపెడిషియన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు అర్హులైన వారు జిల్లా ఆసుపత్రిలో హాజరుకావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు రావడంతో ఆటోలకు కిరాయి దొరకడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇంధన కొరత ఏర్పడడంతో వాణిజ్యపరంగా తమకు నష్టం వాటిల్లుతుందని హోటల్లో నిర్వాహకులు చెబుతున్నారు.
ASF: కాగజ్ నగర్ మండలం చింతగూడలో నిర్వహిస్తున్న సట్టా మట్కా స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. SP రితికా పంత్ ఆదేశాల మేరకు, ASP చిత్తరంజన్, DSP వహీదుద్దీన్ పర్యవేక్షణలో ఈ సోదా నిర్వహించినట్లు SI సందీప్ తెలిపారు. దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.
KNR: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా చొప్పదండి తహశీల్దార్ నవీన్ కుమార్ బుధవారం బూత్ లెవెల్ అధికారులకు అవగాహన కల్పించారు. బీఎల్ఎలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. స్థానికులు, స్థానికేతరుల వివరాల సేకరణలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
JGL: ఎండపల్లి మండలం గొడిసెలపేట శ్రీ కోదండ రామాలయ నిర్మాణానికి మాజీ సింగిల్ విండో ఛైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి భారీ విరాళం ప్రకటించారు. బుధవారం సర్పంచ్ కందికట్ల అమృత రాజేశ్ బృందం ఆయన్ను కలిసి శ్రీరామనవమి కళ్యాణానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన రూ.2 లక్షల నగదుతో పాటు 100 సిమెంట్ బస్తాలను విరాళంగా అందజేశారు.
RR: నందిగామ మండలం సిడితండాలో రూ.10 లక్షలతో గ్రామ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ప్రతి గ్రామంలో గ్రామ సమాఖ్య భవనాలు నిర్మించి మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గబ్రు చౌహన్, తదితరులు పాల్గొన్నారు.
MLG: రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ సూచించారు. ములుగు మున్సిపాలిటీ పరిధి జీవంతరావుపల్లికు చెందిన ఇద్దరు రైతులకు వ్యవసాయ శాఖ 50% రాయితీపై గడ్డి చుట్టే యంత్రాలు అందజేసింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సురేశ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవ్ సింగ్ పాల్గొన్నారు.
PDPL: జిల్లాలోని SC యువతీ, యువకులు ఏప్రిల్ 2 లోపు సబ్సిడీ ఉపాధి యూనిట్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. 100 టూ వీలర్స్, 71 త్రీ వీలర్స్, 15 సోలార్ యూనివర్సల్ పంపు కంట్రోల్ సెట్స్, పశుసంవర్ధక, సెరికల్చర్, పట్టు పరిశ్రమ, ఉద్యానవన పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. వ్యవసాయతర పథకాలకు 21 – 50, వ్యవసాయ పథకాలకు 21 – 60 సంవత్సరాలు ఉండాలన్నారు.
JGL: ఇబ్రహీంపట్నంలోని సీతారామచంద్ర ఆలయం పురాతన ఆలయాన్ని సుమారు 150 ఏళ్ల క్రితం పూర్తిగా రాయి, సున్నంతోనే శిల్పులు నిర్మించారు. ఆలయ మండపంలో ఏకశిల రాతితో ఏర్పాటుచేసిన 16 రాతి స్తంభాలు, ఆలయ నిర్మాణ శైలి అబ్బుర పరుస్తుంది. రాముడు, సీతాదేవి విగ్రహాలను భద్రాచలం రామాలయంలో లాగానే నల్లరాతితో చెక్కిన రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు.