• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

మహోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన సుగుణ

ఆసిఫాబాద్ పట్టణంలోని జనకపూర్ శ్రీ సీతారామ ఆలయంలో నిర్వహించనున్న కోదండ రామస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఇవాళ పరిశీలించారు. ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సుగుణ సూచించారు.

March 26, 2026 / 08:42 AM IST

ITC లో క్యాజువల్ వర్కర్ల నిరసన

BDK: బూర్గంపాడు మండలం సారపాక ITC PSPD యూనిట్ వద్ద క్యాజువల్ వర్కర్లు ఇవాళ  విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. తాము శాంతియుతంగా సమ్మెచేస్తున్న ప్రాంగణాన్ని ఐటీసీ సిబ్బంది అకారణంగా ధ్వంసం చేశారని కార్మికులు ఆరోపించారు. నిరసన స్థలంలో టెంట్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 6వ నంబర్ గేటు వద్ద బైఠాయించారు. యాజమాన్యం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

March 26, 2026 / 08:36 AM IST

బైరామల్ గూడ-ఒవైసీ ఫ్లైఓవర్‌కు లైన్ క్లియర్

RR: హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా బైరామల్‌గూడ జంక్షన్-ఒవైసీ జంక్షన్ 6లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ ప్రక్రియలో సాధారణంగా చేపట్టే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి మేరకు, ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

March 26, 2026 / 08:34 AM IST

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి

PDPL: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భవానితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజీమార్గం ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సివిల్, క్రిమినల్ మొదలైన కేసులను ఉచితంగా పరిష్కరించుకోవచ్చని, కక్షిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

March 26, 2026 / 08:30 AM IST

రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం: ఎస్సై

JN: బచ్చన్నపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఇవాళ ఎస్సై ఎస్.కె. హమీద్ వాహనదారులను తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ఉపయోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపించడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన మొదటి గంట అత్యంత కీలకమని, ఆ సమయంలో బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలన్నారు.

March 26, 2026 / 08:29 AM IST

నార్సింగిలో నేడు తై బజార్ వేలం

MDK: నార్సింగి గ్రామపంచాయతీ కార్యాలయంలో 2026-27 సంవత్సరానికి తై బజార్ వేలం ఇవాళ ఉదయం 11 గంటలకు సర్పంచ్ ఆకుల సుజాత, మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఈవో నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ.50,000 డిపాజిట్‌తో వేలంలో పాల్గొనవచ్చన్నారు. అత్యధిక ధర పలికిన వారికి హక్కులు కల్పిస్తామని చెప్పారు.

March 26, 2026 / 08:28 AM IST

కొబ్బరి చెట్టు పై నుంచి పడి వ్యక్తికి గాయాలు

KMM: నేలకొండపల్లి మండలంలో కొబ్బరి చెట్టు పైనుంచి పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుందని బుధవారం స్థానికులు తెలిపారు. చెరువు మాదారం గ్రామానికి చెందిన ఎస్కే ఇమామ్ సాహెబ్(40) కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కుతుండగా పైనుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సిబ్బంది సహాయంతో గాయపడిన ఇమామ్ సాహెబ్ను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 26, 2026 / 08:26 AM IST

హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్టు

MHBD: నెల్లికుదురు మండలంలోని నైనాల గ్రామంలో చట్ట సాయిలుతో పాటు ఆయన మనవడు యాకయ్యపై ఇంటి స్థలం గొడవలో అదే గ్రామానికి చెందిన ఎండీ, పాలుద్దీన్, ఇమామ్, అన్వర్లు కర్రతో దాడికి పాల్పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పోలీసులు బాధితుల ఇంటి వద్దనే కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.

March 26, 2026 / 08:23 AM IST

జిందాల్ కంపెనీలో ప్రమాదం.. వెల్డర్ మృతి

NLG: నార్కట్ పల్లిలోని జిందాల్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెల్డర్ గణేష్ విశ్వకర్మ (34) మృతి చెందినట్లు నార్కట్ పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. వేయింగ్ బ్రిడ్జి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇనుప పైపు మీద పడటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.

March 26, 2026 / 08:23 AM IST

సలేశ్వరం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు

NGKL: నల్లమల అటవీ ప్రాంతంలో ఏడాదిలో కేవలం మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే దర్శనమిచ్చే సలేశ్వరం రామలింగేశ్వర స్వామి జాతరకు సంబంధించి ఏర్పాట్లు అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టింది. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నల్లమల దట్టమైన అటవీ ప్రాంతంలోని లోయలో రామలింగేశ్వర స్వామి దర్శనం ఇవ్వనున్నారు.

March 26, 2026 / 08:23 AM IST

‘నిరుపేదలకు పక్కా గూడు కల్పించడమే లక్ష్యం’

KMM: వైరా నియోజకవర్గంలోని గిరిజన తండాలు, ఎస్సీ కాలనీల్లోని నిరుపేదలకు పక్కా గూడు కల్పించడమే లక్ష్యమని బుధవారం MLA రాందాస్ నాయక్ పేర్కొన్నారు. లబ్ధిదారుల సంఖ్యను 5 వేలకు పెంచాలని శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

March 26, 2026 / 08:20 AM IST

రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం

NRPT: మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో ‘Arrive Alive’ థర్డ్ ఫేజ్ కార్యక్రమం భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ శ్రీ రామ్ లాల్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

March 26, 2026 / 08:20 AM IST

సిద్దిపేటలో పెట్రోల్ వదంతులు.. సీపీ హెచ్చరిక

సిద్దిపేట జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సీపీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేశారు. అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. వదంతులు నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని, ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

March 26, 2026 / 08:19 AM IST

డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం.. కేసులు నమోదు

MBNR: డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా జిల్లాలోని హోటళ్లు,రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీలు చేయగా, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న మొత్తం 173 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 121 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

March 26, 2026 / 08:16 AM IST

ఇంధన అక్రమ నిల్వలపై ఎస్సై హెచ్చరిక

VKB: పెద్దేముల్లో ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్రోల్ నిల్వ చేయడం వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉత్పన్నమై పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. పెట్రోల్ ఆవిరి పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ఆయన కోరారు.

March 26, 2026 / 08:15 AM IST