RR: హెచ్-సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా బైరామల్‌గూడ జంక్షన్-ఒవైసీ జంక్షన్ 6లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూసేకరణ ప్రక్రియలో సాధారణంగా చేపట్టే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి మేరకు, ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.