BDK: బూర్గంపాడు మండలం సారపాక ITC PSPD యూనిట్ వద్ద క్యాజువల్ వర్కర్లు ఇవాళ విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. తాము శాంతియుతంగా సమ్మెచేస్తున్న ప్రాంగణాన్ని ఐటీసీ సిబ్బంది అకారణంగా ధ్వంసం చేశారని కార్మికులు ఆరోపించారు. నిరసన స్థలంలో టెంట్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 6వ నంబర్ గేటు వద్ద బైఠాయించారు. యాజమాన్యం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.