• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘నిరుపేదలకు పక్కా గూడు కల్పించడమే లక్ష్యం’

KMM: వైరా నియోజకవర్గంలోని గిరిజన తండాలు, ఎస్సీ కాలనీల్లోని నిరుపేదలకు పక్కా గూడు కల్పించడమే లక్ష్యమని బుధవారం MLA రాందాస్ నాయక్ పేర్కొన్నారు. లబ్ధిదారుల సంఖ్యను 5 వేలకు పెంచాలని శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

March 26, 2026 / 08:20 AM IST

రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం

NRPT: మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో ‘Arrive Alive’ థర్డ్ ఫేజ్ కార్యక్రమం భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సీఐ శ్రీ రామ్ లాల్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

March 26, 2026 / 08:20 AM IST

సిద్దిపేటలో పెట్రోల్ వదంతులు.. సీపీ హెచ్చరిక

సిద్దిపేట జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని సీపీ రోహిణి ప్రియదర్శిని స్పష్టం చేశారు. అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని తెలిపారు. వదంతులు నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని, ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

March 26, 2026 / 08:19 AM IST

డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం.. కేసులు నమోదు

MBNR: డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వాడటం చట్టవిరుద్ధమని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గంప శ్రీనివాస్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో మాట్లాడుతూ.. గత 15 రోజులుగా జిల్లాలోని హోటళ్లు,రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లను తనిఖీలు చేయగా, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న మొత్తం 173 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకుని 121 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

March 26, 2026 / 08:16 AM IST

ఇంధన అక్రమ నిల్వలపై ఎస్సై హెచ్చరిక

VKB: పెద్దేముల్లో ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్రోల్ నిల్వ చేయడం వల్ల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఉత్పన్నమై పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని తెలిపారు. పెట్రోల్ ఆవిరి పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించాలని ఆయన కోరారు.

March 26, 2026 / 08:15 AM IST

నల్లగండ్ల హుడా కాలనీలో వెలిగిన సెంట్రల్ లైటింగ్

RR: నల్లగండ్ల హుడా కాలనీలో రూ. 2 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను MLA అరికెపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. అత్యాధునిక వీధి దీపాల వల్ల కాలనీకి కొత్త శోభ రావడమే కాకుండా, రాత్రి వేళల్లో వాహనదారులు, పాదచారుల ప్రయాణం సురక్షితంగా మారుతుందని తెలిపారు.

March 26, 2026 / 08:11 AM IST

హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు

SRCL: వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో బుధవారం స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించారు. గత 8 నెలల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా, ఆలయానికి మొత్తం రూ.6,07,481 ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

March 26, 2026 / 08:11 AM IST

పెద్దగూడెంలో వైభవంగా సీతారాముల కళ్యాణం

వనపర్తి మండలం పెద్దగూడెం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి 11:30 గంటలకు సుముహూర్తంలో శ్రీరాముడు సీతమ్మ మెడలో మంగళసూత్రం ధరించగా అర్చకుడు రమణయ్య పెళ్లి క్రతువును నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దర్శించగా, ఇక్కడ సీతారాముల కళ్యాణం సప్తమి రోజున నిర్వహించడం సంప్రదాయమని స్థానికులు తెలిపారు.

March 26, 2026 / 08:09 AM IST

ట్రాన్స్‌ఫార్మర్ సామర్థ్యం పెంపు

KNR: జమ్మికుంట పట్టణంలోని మేధారు వాడా ప్రాంతంలో ఉన్న 100 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను 160 కేవీఏకు విద్యుత్ అధికారులు అప్ గ్రేడ్ చేశారు. వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని నిరంతర సరఫరా కోసం ఈ చర్య చేపట్టారని అధికారులు తెలిపారు. ఏఈ జమ్మికుంట, వార్డ్ కౌన్సిలర్ చింతల శ్రీనివాస్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు.

March 26, 2026 / 08:05 AM IST

రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్..!

HYD: శ్రీరామ నవమి సందర్భంగా రేపు హైదరాబాద్ ‘కాషాయ’మయం కానుంది. సీతారాంబాగ్, ఆకాశపురి నుంచి హనుమాన్ టేక్డ్ వరకు భారీ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ఒకవైపు ఆలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు, మరోవైపు ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరియనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు భారీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

March 26, 2026 / 08:05 AM IST

టీయూ విద్యార్థులకు అలర్ట్.. మరో 3 రోజులే గడువు

NZB: తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10వ సెమిస్టర్ విద్యార్థులు ఈనెల 28 వరకు పరీక్షా ఫీజు చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొ. కే.సంపత్ కుమార్ తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించడానికి మరో మూడు రోజులే సమయం ఉందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 26, 2026 / 08:03 AM IST

‘ఈనెల 28న వైద్య ఉద్యోగాలకు ఇంటర్వ్యూ’

PDPL: జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు ఈనెల 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. గైనకాలజీ, రేడియాలజీ, ఆప్తమాలజిస్టు, ఆర్థోపెడిషియన్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ ఉద్యోగాలకు అర్హులైన వారు జిల్లా ఆసుపత్రిలో హాజరుకావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 26, 2026 / 08:00 AM IST

ఉచిత బస్సు.. ఇంధన కొరత నిర్వాహకుల ఆందోళన

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు రావడంతో ఆటోలకు కిరాయి దొరకడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇంధన కొరత ఏర్పడడంతో వాణిజ్యపరంగా తమకు నష్టం వాటిల్లుతుందని హోటల్లో నిర్వాహకులు చెబుతున్నారు.

March 26, 2026 / 07:54 AM IST

మట్కా స్థావరంపై పోలీసులు మెరుపుదాడి

ASF: కాగజ్ నగర్ మండలం చింతగూడలో నిర్వహిస్తున్న సట్టా మట్కా స్థావరంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. SP రితికా పంత్ ఆదేశాల మేరకు, ASP చిత్తరంజన్, DSP వహీదుద్దీన్ పర్యవేక్షణలో ఈ సోదా నిర్వహించినట్లు SI సందీప్ తెలిపారు. దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.

March 26, 2026 / 07:54 AM IST

ఓటరు జాబితా సవరణపై అవగాహన

KNR: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా చొప్పదండి తహశీల్దార్ నవీన్ కుమార్ బుధవారం బూత్ లెవెల్ అధికారులకు అవగాహన కల్పించారు. బీఎల్ఎలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. స్థానికులు, స్థానికేతరుల వివరాల సేకరణలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.

March 26, 2026 / 07:52 AM IST