HYD: మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో 118 మంది మందుబాబులపై కేసులు నమోదు చేశారు. వాహనాల వారీగా చూస్తే.. టూ వీలర్లు 96, త్రీ వీలర్ వాహనాలు 4, ఫోర్ వీలర్లు 18 ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడపవద్దని మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.