SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం జనగణనపై మూడో రోజు ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శిక్షకులు రహీం, సంగ్‌శెట్టి సెన్సెస్ నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో జనగణన, ఇంటి గణన సర్వే ఏ విధంగా చేపడతారో.. దీనిపై ఎన్యూమరేటర్, యజమాని మధ్య సంభాషణపై చక్కగా ప్రదర్శించారు.
NRML: ఖానాపూర్ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లింపుకు గడువు పెంచినట్లు ఖానాపూర్ మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం 2026-27కు సంబంధించి ఇచ్చిన ఐదు శాతం రాయితీ చెల్లింపు గడువు ముగిసిపోగా ప్రభుత్వం మళ్లీ గడువు పెంచిందని, ఈనెల ఏడు వరకు ఐదు శాతం రాయితీతో చెల్లించవచ్చునని తెలిపారు.
HYD: కంటోన్‌మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ వెస్ట్ మారేడ్‌పల్లిలో సాయి సాత్విక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను ప్రారంభించారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు మహిళా సంఘాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో కోటి మంది మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
SRCL: పంట మార్పిడితో సుస్థిర ఆదాయం పొందవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి దుర్గరాజు అన్నారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతలకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, ఏఎంసీ, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
PDPL: కమాన్పూర్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం BRS నాయకులు సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, 41 కిలోల బదులు 42 కిలోల తూకం వేస్తున్నారని మండల అధ్యక్షుడు తాటికొండ శంకర్ ఆరోపించారు. ఎండల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు.
VKB: జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలోని పట్టు పరిశ్రమ పరిశోధన కేంద్రం, భూసార పరీక్షా కేంద్రం నిరుపయోగంగా మారాయి. గత కొంతకాలంగా ఇవి మూతపడి ఉండటంతో అటు పట్టు రైతులు, ఇటు భూసార పరీక్షల కోసం వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ కార్యాలయం పక్కనే ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.
RR: ఇవాళ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ జన్మదినం సందర్భంగా, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర TUFIDC ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరుకున్నారు.
HNK: కారల్ మార్క్స్ ఆశయ సాధనమైన దోపిడీ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. గుండ్ల సింగారంలో కారల్ మార్క్స్ 208వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెట్టుబడిదారి వ్యవస్థకు మార్క్సిజమే ప్రత్యామ్నాయమని, సమానత్వానికి, సామాజిక న్యాయానికి, నిరుద్యోగ నిర్మూలనకు మార్క్సిజం ఒక్కటే ఔషధమన్నారు.
JGL: రాయికల్ పట్టణంలోని అంగన్వాడి- 1 కేంద్రంలో మంగళవారం టీహెచ్ ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి సీడీపీవో జయప్రద గర్భిణీలు, బాలింతలకు, చిన్నారులకు పోషకాహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. పిల్లల ఆరోగ్యం, శారీరక అభివృద్ధి కోసం సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.
MNCL: ధాన్యం కొనుగోలులో లోటుపాట్లు రాకుండా చూడాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రాములు ఆదేశించారు. మంగళవారం జన్నారం మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ ఉన్నారు.
BDK: 24 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చి రోజుకు 15 నుంచి 20 సార్లు కరెంటు కోత విధిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు కాంగ్రెస్‌ను విమర్శించారు. ప్రజలను, రైతులను, వినియోగదారులను, ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇవాళ పాల్వంచ సబ్‌స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులతో ధర్నా చేపట్టారు. కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు అందించాలని వారు డిమాండ్ చేశారు.
MLG: ప్రజా పాలన-ప్రగతి ప్రణాలిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మెగా రైతు మేళాకు మల్లంపల్లి రైతులు తరలి వెళ్లారు. ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. సర్పంచ్ ల్యాడ శ్యామ్ రావు జెండా ఊపి ప్రారంభించారు. వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
ADB: చిన్నారులకు ఎప్పటికప్పుడు టీకాలు వేయాలని వైద్యాధికారి సద్దాం అన్నారు. మంగళవారం నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ కార్యకర్తలు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వడదెబ్బపై ప్రతిఒక్కరికి అవగాహన కలిగేలా చూసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో HEO పవార్ రవీందర్, సంతోష్, స్వర్ణలత ఉన్నారు.
HYD: కుత్బుల్లాపూర్‌లోని సురారం PS పరిధిలో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. మల్లారెడ్డి ఆస్పత్రి ముందు రోడ్డు పక్కన మార్బుల్ షాప్ వద్ద నలుగురు పిల్లలతో కలిసి నిద్రిస్తున్న తల్లి ఒడిలో నుంచి, అర్ధరాత్రి ఆరు నెలల చిన్నారి ఆశను దుండగులు అపహరించారు. తల్లి నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, చిన్నారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
MDK: బాలల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి తెలిపారు. నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. కమిషన్ సభ్యులు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ బాలల హక్కుల ఉల్లంఘనలు, పౌష్టికాహార లోపం, రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, మెరుగైన విద్య, ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం పిల్లలపై దాడులను అరికట్టాలని కోరారు.