• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

CM పై కేసు నమోదు చేయాలని CP వినతి

WGL: CPI శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి BRS పార్టీపై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని కోరుతూ, సోమవారం BRS పార్టీ ఆధ్వర్యంలో CP సన్‌ప్రీత్ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. BRS పార్టీ పై అనుచిత వాక్యాలు చేయడం సరికాదని అన్నారు.

January 19, 2026 / 08:30 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి: ఎంపీ

ADB: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా చాటాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు బ్రహ్మానంద్‌తో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీలో పార్టీ బలంగా ఉందని అందరూ సంసిద్ధంగా ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ శ్రేణులను కోరారు.

January 19, 2026 / 08:30 PM IST

మంత్రి కోమటిరెడ్డితో నాయిని రాజేందర్ రెడ్డి భేటీ

HNK: హన్మకొండ R&B అతిథి గృహంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కీలక రోడ్లు, ప్రధాన రహదారుల విస్తరణ, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, అభివృద్ధి పనులపై సంక్షిప్తంగా చర్చించారు.

January 19, 2026 / 08:29 PM IST

‘మహిళ సాధికారతకు చేయూత’

MDK: మహిళ సాధికారతకు ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు పేర్కొన్నారు. మెదక్ పట్టణంలో 346 మంది మహిళా సంఘాలకు రూ. 90,24,810 వడ్డీ చెక్కు అందజేశారు. మహిళ ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కుటుంబానికి మహిళలే వెన్నుముక అన్నారు. నాయకులు పాల్గొన్నారు.

January 19, 2026 / 08:27 PM IST

అక్రమ ఇసుక తవ్వకాలపై విచారణ

KNR: వీణవంక మండలం చల్లూరు పరిధిలోని మానేరు వాగులో ఇసుక క్వారీకి అనుమతి పొంది, ఇప్పలపల్లి గ్రామ పరిధిలో అక్రమంగా ఇసుక తోడుతున్నారని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు ఆదేశించారు. కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.

January 19, 2026 / 08:25 PM IST

వడ్డీ లేని రుణాల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

JGL: జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 938 మహిళా సంఘాలకు వడ్డీ రహిత రుణాల చెక్కులను మంత్రి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌తో కలిసి సోమవారం పంపిణీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో రూ.2,98,40,444 విలువ గల చెక్కులను అందజేసి, సకాలంలో రుణాలు చెల్లించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, మహిళలు పాల్గొన్నారు.

January 19, 2026 / 08:24 PM IST

ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంది: ఎమ్మెల్యే

BHPL: జిల్లా కేంద్రంలోని రామయ్యపల్లి గ్రామంలో ఇవాళ సాయంత్రం రూ.10 లక్షల వ్యాయామంతో నిర్మించనున్న లక్ష్మీ దేవర దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, DCC జిల్లా అధ్యక్షుడు కరుణాకర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

January 19, 2026 / 08:23 PM IST

సర్పంచులకు శిక్షణ తరగతులు

JGL: కథలాపూర్ మండలంలోని 19 గ్రామాల సర్పంచులు ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరయ్యారు. మల్యాల మండలం నూకపల్లి గ్రామ శివారులో గల న్యాక్ సెంటర్లో సర్పంచులకు ఐదు రోజులపాటు శిక్షణ తరగతులు ఉంటాయని అధికారులు తెలిపారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు బాధ్యతలు, విధులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అధికారులు తెలియజేశారు.

January 19, 2026 / 08:22 PM IST

అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ సమావేశం

NZB: కలెక్టరేట్‌లో ఈనెల రేపు ఉదయం 10.30 గంటలకు MP ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం జరగనుందని DRDO సాయాగౌడ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులచే వివిధ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై దిశ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. సంబంధిత శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

January 19, 2026 / 08:22 PM IST

“VBG RAM G పథకాన్ని తీసివేయడానికి కుట్రలు చేస్తుంది”

JN: జిల్లా BJP కార్యాలయంలో ఇవాళ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ఆధ్వర్యంలో ‘VBG RAM G’ పథకం కార్యశాల ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BJP రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసివేయడానికి కుట్రలు చేస్తోందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు పాల్గొన్నారు.

January 19, 2026 / 08:19 PM IST

‘విద్యుత్ సమస్యలు పరిష్కారం కాకపోతే ఫిర్యాదు చేయవచ్చు’

KMR: విద్యుత్ సమస్యల పరిష్కారం కాకపోతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని తెలంగాణ విద్యుత్ వినియోగదారుల ఫోరం ఛైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని సబ్ స్టేషన్‌ల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

January 19, 2026 / 08:15 PM IST

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో TET పరీక్షలు

BDK: TG TET–2026 పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఇవాళ తెలిపారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, భద్రతా చర్యలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణను కచ్చితంగా పాటిస్తూ అధికారులు నిర్వహిస్తున్నారన్నారు.

January 19, 2026 / 08:14 PM IST

‘అందరూ భాగస్వాములు కావాలి’

MNCL: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ సూచించారు. సోమవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చౌరస్తా వద్ద వాహనదారులకు రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.

January 19, 2026 / 08:13 PM IST

మున్సిపాలిటీలో సీపీఎం అభ్యర్థులను గెలిపించండి: బండి రమేష్

KMM: ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్ అన్నారు. ఇవాళ ఖమ్మం రూరల్ సీపీఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కొంతమంది తమ స్వార్థ రాజకీయాల కోసం మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, దీంతో అధిక పన్నులు కట్టలేక పేదలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.

January 19, 2026 / 08:10 PM IST

‘రేషన్ కార్డు ప్రామాణికంగా ఇందిరమ్మ చీరలు’

MDK: మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

January 19, 2026 / 08:08 PM IST