MNCL: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనే చిత్తశుద్ధిని సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ సభలో ప్రకటించాలని,CPI (ML)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. అడా, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణంకు చర్యలకు పూనుకోవాలని కోరారు.
JGL: జగిత్యాల మామిడి కాయలకు ఇతర రాష్ట్రాలతో పాటు వివిధ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలో దాదాపు 34 వేల ఎకరాల్లో మామిడి పంట సాగు అవుతోంది. ఏటా 1,000 లారీల వరకు మామిడి కాయలను వ్యాపారులు ఎగుమతి చేస్తుంటారు. ఈసారి ఇప్పటికి 5 వేల టన్నుల కొనుగోళ్లు జరిగినట్లు అధికారులు తెలిపారు. కానీ ఈసారి అకాల వర్షాల కారణంగా మామిడి పూత, కాయలు రాలి నష్టం వాటిల్లింది.
BHNG: వలిగొండలోని రాజీవ్ చౌరస్తా వద్ద ఇవాళ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోళ్లను వెంటనే వేగవంతం చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
MHBD: ఆయిల్ ఫామ్ సాగుతో రైతుకు నికర ఆదాయం వస్తుందని ఆత్మ కమిటీ ఛైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు. గొల్లచర్లలో నిర్వహించిన రైతు వారోత్సవాలలో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు పంటల సాగులో మెలకువలను పాటించి అధిక దిగుబడులను పొందాలని, ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను గమనిస్తూ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను తీసుకోవాలన్నారు.
SDPT: బెజ్జంకి వడ్ల కొనుగోలు కేంద్రంలో అవకతవకలు జరుగుతున్నాయని బీజేపీ మండల అధ్యక్షుడు రాజు ఆరోపించారు. మంచి నాణ్యత ఉన్న ‘ఏ’ గ్రేడ్ వడ్లను ‘బీ’ గ్రేడ్‌గా నమోదు చేసి రైతులను నష్టపరుస్తున్నారని తెలిపారు. క్వింటాల్‌కు రూ.2,389 మద్దతు ధర వెంటనే అమలు చేయాలని, తేమ పరీక్షలు రైతుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని, అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
WNP: గోపాల్ పేట మండలం చెన్నూరు గ్రామంలో వెనికి తాండ నుంచి ముందరి తాండ వరకు పూల చెట్లు రహదారి ఇరువైపులా రంగులతో కళకళలాడుతున్నాయి. తాండ ప్రజలు ఈ అందాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. చెట్లు ఉంటేనే గాలి, పర్యావరణ రక్షణ ఉంటుందని వారు తెలిపారు. ఈ పూల చెట్లు రహదారికి కొత్త అందాన్ని తెచ్చాయి.
KNR: కరీంనగర్ బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో CPI జిల్లా సమితి ఆధ్వర్యంలో కారల్ మార్క్స్ 208వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో CPI రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, వి.ఎస్. బోస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసఫ్, వాసిరెడ్డి పాల్గొన్నారు.
SRPT: పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం (POSH)పై ఈరోజు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ అవగాహన కల్పించారు. మహిళా సిబ్బందికి ‘పెద్దన్న’లా అండగా ఉంటానని, సమస్యలపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లాలో ఇంటర్నల్ కమిటీలు ఏర్పాటు చేశామని, యూనిఫాంతో ఆకతాయిల్లో భయం కలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.
KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు సూచించారు. మంగళవారం ఆర్టీసీ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బస్సు వెళ్లని గ్రామాలను గుర్తించాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు.
HNK: కేసీఆర్‌కు, వ్యవసాయానికి అభినాభావ సంబంధం ఉందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హనుమకొండలో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుకు పెట్టుబడి సహాయం అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఓరుగల్లు వేదికగా రాహుల్ గాంధీ రైతులకు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ హామీలు పూర్తిగా అమలు కాలేదన్నారు.
NRML: మామడ మండలం సాంగ్వీ గ్రామంలో నిర్మల్ మాజీ AMC ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కీ.శే. ఏనుగు లింగా రెడ్డి ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు , ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మంగళవారం వారి స్వగ్రామంలో లింగ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధైర్యంగా ఉండాలని తెలిపారు.
NZB: సిరికొండ మండల ఇవాళ కొండూరు ఐకేపీ సెంటర్‌ను తహసీల్దార్ రవీందర్ రావు సందర్శించారు. సెంటర్లోని సమస్యలు, ఎంట్రీ రికార్డులు, ట్రాక్ షీట్లు సమగ్రంగా పరిశీలించారు. పని తీరును తెలుసుకుని సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఏ, సీసీ, ఏపీఎం, అలాగే రైతులు పాల్గొన్నారు.
MLG: ములుగు రామాలయం రోడ్‌లోని పెట్రోల్ బంక్‌లో తీవ్ర ఎండల నేపథ్యంలో వినియోగదారులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ప్రయాణికులకు చల్లని ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ సేవ అందుబాటులో ఉంచారు. బంక్‌కు వచ్చే ప్రతి ఒక్కరూ మజ్జిగ తాగి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.
NLG: చిట్యాల మండలం ఏపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా.. విద్యార్థులకు ఇవాళ మెమోలను పంపిణీ చేశారు. జిల్లాలో 4వ ర్యాంకు సాధించిన తర్ర అఖిల్ (573), మండల స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన లక్ష్మి ప్రసన్న, శివమణి, భవానిలను సర్పంచ్ పాలెం మహేష్, హెచ్ఎం మోహన్ రెడ్డి అభినందించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.
SRCL: రెవెన్యూ అధికారిగా రమాదేవిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయిలు కూడా బదిలీ అయ్యారు. వెంకటేశ్వర్లు జనగామ డీఆర్వోగా బదిలీ కాగా, రాధాభాయిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సిరిసిల్ల ఆర్డీవోగా రాజేందర్ రెడ్డిని, VMWD ఆర్డీవోగా కేఎస్బీ కుమారిని నియమించారు.