ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన సాధు సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.