KNR: హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ( పీహెచ్సీ) ముందు ఆశా కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు రావాల్సిన పెండింగ్ మార్చి, ఏప్రిల్ పారితోషకాలు ఇవ్వాలని, అలాగే రూ.18000 ఫిక్స్డ్ వేతనం అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసన అనంతరం విధుల్లో చేరారు.
KMR: తాడ్వాయి మండలం కాళోజి వాడి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మండల ప్రత్యేక అధికారి మంగళవారం పరిశీలించారు. పనులకు వస్తున్న కూలీల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అధిక సంఖ్యలో కూలీలు వచ్చే విధంగా చూడాలన్నారు. పనుల వద్ద కూలీలకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ఆయన వెంట గ్రామ సర్పంచి చంద్రారెడ్డి సిబ్బంది ఉన్నారు.
HYD: శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. HYDలోని స్పీకర్ అధికార నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్‌కు స్పీకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయగా, స్పీకర్‌ను డీజీపీ పుష్పగుచ్ఛంతో సత్కరించారు.
ADB: బోథ్ మండలంలోని లేండిగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక మడవి శ్రీదేవి(14) అనే బాలిక మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత అర్ధరాత్రి నుండి బాలిక తీవ్ర వాంతులు విరోచనాలతో బాధపడుతుందని మంగళవారం ఉదయం విరోచనాలు ఎక్కువై అపస్మారక స్థితిలోకి చేరుకుని చనిపోయిందని వారు తెలిపారు.
JN: జిల్లా విద్యా శాఖలో అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కంప్యూటర్ పరిజ్ఞానం, ముఖ్యంగా MS Office, Excel, PowerPoint నైపుణ్యం తప్పనిసరి అని పేర్కొన్నారు.
MHBD: BRS కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని మాజీ ఎంపీ కవిత అన్నారు. మహబూబాబాద్‌లోని క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలతో ఎంపీ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. BRS పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
BHPL: రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాలలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉద్యానవన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుదలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో MLA పాల్గొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు పంట మార్పిడి పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు పొందాలన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 10TH, ఇంటర్ ఫలితాల్లో రాణించిన ప్రభుత్వ మైనారిటీ గురుకుల విద్యార్థులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
BDK: భద్రాచలం పట్టణానికి చెందిన మద్దాల పవన్ సాయి మోహన్ మంగళవారం శ్రీసీతారామచంద్రస్వామివారికి సుమారు 655 గ్రాముల బరువు కలిగిన వెండి పళ్లెమును విరాళంగా సమర్పించారు. దీని విలువ సుమారు రూ.1,70,000 ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా దాత పవన్ సాయి మోహన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు.
KMM: బోనకల్ PHC ఎదుట CITU ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మార్చి, ఏప్రిల్ నెలల పారితోషకాలు అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ డాక్టర్ స్రవంతికి వినతిపత్రం అందజేశారు. వేసవిలో ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సి వస్తోందని, వెంటనే ప్రభుత్వం బకాయిలు విడుదల చేయాలని సీఐటీయూ నాయకులు వీరబాబు, నరేష్ డిమాండ్ చేశారు.
SRCL: గంభీరావుపేట మండలానికి పర్యటనకు వచ్చిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులకు సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. గంభీరావుపేట మండలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.
MDK: రైతులు వ్యవసాయ పంటల సాగులో రసాయన ఎరువులు, యూరియా వాడకం తగ్గించాలని కంది వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొ. లక్ష్మణ్ రావు, నీమా పేర్కొన్నారు. చేగుంట మండలం చందాయపేటలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం చేపట్టారు. సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ, జీవ ఎరువులు, పశువుల పేడ వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో హరిప్రసాద్, సర్పంచ్ మహేశ్వరి పాల్గొన్నారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని 21వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్, కాన్సిలర్ మబ్బు రాములు, మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.
GDWL: జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా సీహెచ్ మధుమోహన్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన లక్ష్మీనారాయణ పదవీ విరమణ చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీవోగా ఉన్న మధుమోహన్‌ను ఈ పదవికి ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా పాలనలో కీలక బాధ్యతలు చేపట్టనున్న ఆయన, త్వరలోనే పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
ADB: ఆదివాసి గిరిజనుల సమస్యల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఐటీడీఏ నూతన పీఓ మంద మకరంద్‌ను బీఆర్ఎస్‌వీ మాజీ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మంగళవారం మేరకు ఉట్నూర్ ఐటీడీఏ పీఓ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మంద మకరంద్‌ను ఐటీడీఏ కార్యాలయంలో కలిసి శాలువాతో సన్మానించారు.