WNP: అనారోగ్యంతో బాధపడుతున్న జిల్లాలోని మదనపురం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్ జేమ్స్‌ను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన చికిత్స తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మనోజ్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.