ASF: ఆసిఫాబాద్ SC గురుకులంలో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఉపాధ్యాయులు మానవత్వం చాటుకున్నారు. అదే గురుకులంలో కుక్గా పనిచేస్తున్న నిర్మలకు బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల వంట చేస్తుండగా వేడి నీళ్లు 2 కాళ్లపై పడి ఆమె తీవ్రంగా కాలిపోయింది. పేద కుటుంబానికి చెందిన నిర్మలకు ఆసుపత్రి ఖర్చులు భారంగా మారడంతో ఉపాధ్యాయులు తమకు తోచినంత సహాయం చేశారు.